CM KCR: ఎన్నికలు రాగానే కొత్త భిక్షగాళ్ల మాయమాటలు.. విపక్ష పార్టీలపై సీఎం కేసీఆర్ ఫైర్

గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ. 10 లక్షల చొప్పున సీఎం నిధులను అందిస్తున్నట్లుగా తెలిపారు సీఎం కేసీఆర్. సూర్యాపేటలో సూర్యాపేట కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం, వైద్య కళాశాలను ప్రారంభించిన అంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మానవభివృద్ధి సూచికలో రాష్ట్రం మంచి స్థానంలో ఉండటం గర్వకారణం అన్నారు. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో అగ్రస్థానంలో ఉందన్నారు. రూ.100 కోట్లతో పరిపాలన భవనాలు నిర్మించుకున్నామన్నారు. ఇప్పటికే ఎన్నో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుకున్నామన్నారు.

CM KCR: ఎన్నికలు రాగానే కొత్త భిక్షగాళ్ల మాయమాటలు.. విపక్ష పార్టీలపై సీఎం కేసీఆర్ ఫైర్
CM KCR
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 20, 2023 | 6:44 PM

సూర్యాపేట జిల్లాపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వరాల జల్లు కురిపించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ. 10 లక్షల చొప్పున సీఎం నిధులను అందిస్తున్నట్లుగా తెలిపారు సీఎం కేసీఆర్. సూర్యాపేటలో సూర్యాపేట కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం, వైద్య కళాశాలను ప్రారంభించిన అంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మానవభివృద్ధి సూచికలో రాష్ట్రం మంచి స్థానంలో ఉండటం గర్వకారణం అన్నారు. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో అగ్రస్థానంలో ఉందన్నారు. రూ.100 కోట్లతో పరిపాలన భవనాలు నిర్మించుకున్నామన్నారు. ఇప్పటికే ఎన్నో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుకున్నామన్నారు.

సూర్యాపేట జిల్లాలో ప్రతి గ్రామపంచాయతీకి రూ.10 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. సూర్యాపేటలో కళాభారతి నిర్మాణానికి రూ.25 కోట్లు మంజురు చేస్తున్నట్లుగా తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు కేటాయింపులు చేశారు. సూర్యాపేట అభివృద్ధికి మరో రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్లుగా వెల్లడించారు. సూర్యాపేట అద్భుత ప్రగతితో దూసుకుపోతోందన్నారు.

ఏం చేశారో చెప్పండి..

50 ఏళ్లు కాంగ్రెస్‌కు పార్టీకి అవకాశం ఇచ్చినా ఏం చేశారని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. సూర్యాపేట, భువనగిరి, నల్గొండలో మెడికల్‌ కాలేజీలు పెట్టాలని ఎప్పుడైనా అనుకున్నారా..సూర్యాపేట, నల్గొండ గతంలో ఎలా ఉన్నాయో మనం చూశామో చెప్పాలని అడిగారు. ఇప్పుడెలా ఉన్నాయి.. రైతు చనిపోతే ఆపద్భందు పేరుతో ఆర్నెళ్లకు రూ.50 వేలు ఇచ్చేవారు. అంచెలంచెలుగా సంక్షేమ పథకాల నిధులు పెంచుకుంటూపోతున్నామన్నారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ మరో అవకాశం కావాలని అడుగుతోందని ఎద్దేవ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పాలిస్తున్న రాష్ట్రాల్లో రూ.4 వేల పింఛను ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలని అన్నారు.

సీఎం కేసీఆర్ వరాలు..

సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ విశ్వనరంగా మారుతోంది, పరిశ్రమలు వస్తున్నాయి, ఈ అభివృద్ధి, సంక్షేమం ఇలాగే కొనసాగాలంటే మళ్లీ బీఆర్‌ఎస్‌ గెలవాలి అన్నారు. సూర్యాపేటలో నాలుగు ఎమ్మెల్యేలు గెలవడం ఖాయం. మరోసారి బీఆర్‌ఎస్‌ పార్టీ గెలవడం ఖాయం. ఎవరెన్ని చెప్పినా, ఇంకా సీట్లు పెరుగుతాయి తప్ప తగ్గవు’ అని చెప్పుకొచ్చారు. సూర్యాపేట పట్టణం మరింత అభివృద్ధి చెందాలంటే ఇక్కడ కొత్తగా కొన్ని రోడ్లు కావాలని మంత్రి జగదీశ్‌ రెడ్డి తనను కోరినట్లుగా సీఎం కేసీఆర్ ప్రస్థావించారు. ఆ కోరిక మేరకు మిగతా 4 మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున.. సూర్యాపేటకు ప్రత్యేకంగా రూ.50కోట్లు మంజూరు చేస్తున్నారు. మహిళా పాలిటెక్నిక్‌ కాలేజీ కావాలని మంత్రి అడిగారని.. దాన్ని కూడా త్వరలోనే మంజూరు చేస్తానని అన్నారు సీఎం కేసీఆర్.

జిల్లా కావడమే ఒక చరిత్ర..

సూర్యపేటలో నిర్మించిన పలు భవనాలను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సూర్యాపేట… జిల్లా కావడమే ఒక చరిత్ర. అనేక రంగాల్లో తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉంది. తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉంది. తలసరి ఆదాయంలో తెలంగాణనే నెంబర్‌వన్‌. జీరో ఫ్లోరోసిస్‌ స్టేట్‌గా తెలంగాణ నిలిచింది. విద్యుత్‌ వినియోగంలో మనమే టాప్‌.జిల్లాకో మెడికల్‌ కాలేజీ… ఏ రాష్ట్రంలోనూ లేదు’ అని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం