Weekend Hour With Murali Krishna LIVE: తెలంగాణలో పెరిగిన పొలిటికల్ హీట్.. లైవ్ వీడియో
ఎన్నికల షెడ్యూల్ రాక ముందే అభ్యర్థులను ప్రకటించేందుకు మూడు పార్టీలు సిద్ధమైపోయాయి. ఎన్నికలకు మూడు, నాలుగు నెలల సమయమే ఉండటంతో ఎత్తులు, పైఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాల్లో పార్టీలు మునిగితేలుతున్నాయి. నేడో, రేపో అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ప్రకటిస్తారని చెప్పడంతో ఈ హీట్ తారస్థాయికి చేరింది. అదే సమయంలో తమ ప్రభుత్వం ఇన్నాళ్లు చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పనులను ప్రగతి నివేదన సభ పేరుతో సీఎం కేసీఆర్ ప్రజల ముందుంచి ముందుగానే ఎన్నికల శంఖారావం పూరించారు...
ఎన్నికల షెడ్యూల్ రాకముందే తెలంగాణలో పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోయింది. గతానికి భిన్నంగా ఈసారి ముందుగానే అభ్యర్థులను ప్రకటించే ప్రోగ్రామ్‌కు అన్ని పార్టీలు శ్రీకారం చుట్టాయి. నేడో, రేపో అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. శ్రావణ మాసం అలా వచ్చిందో లేదో తెలంగాణలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగిపోయింది. నువ్వా, నేనా అన్నట్టుగా మూడు ప్రధాన రాజకీయ పార్టీలు రాజకీయ అగ్గిని రాజేస్తున్నాయి.
ఎన్నికల షెడ్యూల్ రాక ముందే అభ్యర్థులను ప్రకటించేందుకు మూడు పార్టీలు సిద్ధమైపోయాయి. ఎన్నికలకు మూడు, నాలుగు నెలల సమయమే ఉండటంతో ఎత్తులు, పైఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాల్లో పార్టీలు మునిగితేలుతున్నాయి. నేడో, రేపో అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ప్రకటిస్తారని చెప్పడంతో ఈ హీట్ తారస్థాయికి చేరింది. అదే సమయంలో తమ ప్రభుత్వం ఇన్నాళ్లు చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పనులను ప్రగతి నివేదన సభ పేరుతో సీఎం కేసీఆర్ ప్రజల ముందుంచి ముందుగానే ఎన్నికల శంఖారావం పూరించారు. కర్నాటక గెలుపుతో వచ్చిన ఉత్సాహం తెలంగాణ కాంగ్రెస్‌ను పుంజుకునేలా చేస్తోంది. కర్నాటక తరహ యాక్షన్ ప్లాన్ తెలంగాణలోనూ అమలు చేసేందుకు పావులు కదుపుతోంది. వచ్చే నెలలో అభ్యర్థుల ప్రకటన ఉంటుందని TPCC ఇప్పటికే ప్రకటించింది. అదే సమయంలో గతానికి భిన్నంగా టికెట్ల కోసం అప్లికేషన్ల అమ్మకాన్ని చేపట్టింది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు రాహుల్, ప్రియాంక, ఖర్గేతో సభలు నిర్వహించడంతో పాటు రకరకాల డిక్లరేషన్స్ ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే వారం చేవెళ్లలో భారీ సభ నిర్వహించి పోల్ విజిల్ వేసేందుకు హస్తం సిద్ధమవుతోంది. 2018 ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీలో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచిన BJP ఇప్పుడు అధికార BRSకు తామే ప్రధాన ప్రత్యర్థినని చెప్తోంది. అధికార BRSను కట్టడి చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలను కమలనాథులు చేస్తున్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్దం చేసేందుకు ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలకు తెలంగాణలోని నియోజకవర్గాల బాధ్యతలను బీజేపీ అధిష్టానం అప్పగించింది.
ఢిల్లీ పెద్దలు తెలంగాణ నేతలకు ప్రతీ విషయంలో దిశానిర్దేశం చేస్తున్నారు. అదే సమయంలో చేరికలతో BRSను చక్రవ్యూహంలో బంధించాలని బీజేపీ చూస్తోంది. అమిత్ షా రాక సందర్భంగా చేరికలు ఉండేలా తెలంగాణ బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. మొత్తానికి నవంబర్-డిసెంబర్‌లో జరిగే ఎన్నికలకు తెలంగాణ ముందుగానే పూర్తిస్థాయిలో సిద్ధమైపోయింది. ఇక రావాల్సింది ఎన్నికల షెడ్యూలే.
తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పొలిటికల్ హీట్‌పై వీకెండ్ అవర్ విత్ మురళీ కృష్ణ..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..