CM KCR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేసీఆర్‌ సంచలన నిర్ణయం.. ఆ పార్టీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు..

త్వరలో జరగనున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ..

CM KCR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేసీఆర్‌ సంచలన నిర్ణయం.. ఆ పార్టీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు..
CM KCR
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 21, 2023 | 10:44 AM

త్వరలో జరగనున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతునివ్వాలని నిర్ణయించారు. గతంలో మాదిరి సీటు తమకే కేటాయించి తమకు మద్దతు ప్రకటించాలని మిత్రపక్షమైన ఎం ఐ.ఎం చేసిన అభ్యర్థించింది. ఈ మేరకు, పార్టీ సీనియర్లతో చర్చించిన సీఎం కేసీఆర్‌ ఎంఐఎం అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఏడాదికి ముందు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. కాగా.. తెలంగాణలో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ స్థానంతో పాటు హైదరాబాద్‌ స్థానిక సంస్థల స్థానంలో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్‌ మార్చి 13న.. ఓట్ల లెక్కింపు మార్చి 16న జరగనుంది.

త్వరలో జరగనున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గతంలో మాదిరి సీటు తమకే కేటాయించి తమకు మద్దతు ప్రకటించాలని మిత్రపక్షమైన ఎం ఐ.ఎం చేసిన అభ్యర్థన మేరకు, పార్టీ సీనియర్ల తో చర్చించిన మీదట…హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మిత్రపక్షమైన ఎం.ఐ.ఎం పార్టీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతునివ్వాలని బీఆర్ఎస్ అధినేత., ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

అయితే ఈ ఎన్నికల్లో పోటీకి అధికార బీఆర్ఎస్ దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ రెండు స్థానాలుకు 2017లో ఎన్నికలు జరగ్గా.. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థి సయ్యద్ అమీనుల్ హసద్ జాఫ్రీకి, మహబాబ్ నగర్ – రంగారెడ్డి – హైద్రాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికిగానూ పీఆర్టీయూ- టీఎస్ అభ్యర్థి కాటేపల్లి జనార్దన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఈసారి కూడా మజ్లిస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం