AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Justice NV Ramana: పేద ప్రజలకు న్యాయం అందించడమే అంతిమ లక్ష్యం.. తేల్చి చెప్పిన జస్టిస్‌ ఎన్వీ రమణ

కోర్టుల్లో సరైన మౌలిక వసతులు ఉంటేనే పేదలకు సత్వర న్యాయసేవలు అందుతాయని అన్నారు CJI ఎన్వీరమణ. ఈ అంశంపై కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలూ దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం న్యాయవ్యవస్థకు..

Justice NV Ramana: పేద ప్రజలకు న్యాయం అందించడమే అంతిమ లక్ష్యం.. తేల్చి చెప్పిన జస్టిస్‌ ఎన్వీ రమణ
Nv Ramana
Sanjay Kasula
|

Updated on: Dec 19, 2021 | 10:30 PM

Share

పేద ప్రజలకు న్యాయం అందించడమే అంతిమ లక్ష్యం.. తేల్చి చెప్పిన జస్టిస్‌ ఎన్వీ రమణ ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ 18వ స్నాతకోత్సవానికి జస్టిస్‌ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. హక్కులు, న్యాయం కోసం పోరాడేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమ శక్తిని వినియోగించుకునే మార్గమే యువత భవిష్యత్‌ను నిర్దేశిస్తుందని పేర్కొన్నారు. భాష ఏదైనా సమాచార మార్పిడి సమర్థంగా, ఆకర్షణీయంగా ఉండాలని ఆయన సూచించారు. న్యాయ సమానత్వం కోసం న్యాయవాదులు కృషి చేయాలని కోరారు.

కోర్టుల్లో సరైన మౌలిక వసతులు ఉంటేనే పేదలకు సత్వర న్యాయసేవలు అందుతాయని అన్నారు CJI ఎన్వీరమణ. ఈ అంశంపై కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలూ దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం న్యాయవ్యవస్థకు అందిస్తున్న మద్దతుని అభినందించారు. హనుమకొండలో కొత్తగా నిర్మించిన కోర్టుల భవన సముదాయన్ని ప్రారంభించారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ.

హనుమకొండలో అత్యాధునిక కోర్టుల భవన సముదాయం అందుబాటులోకి వచ్చింది. జిల్లా కోర్టు ప్రాంగణంలో 23 కోట్ల రూపాయల వ్యయంతో 10 కోర్టులతో కూడిన కొత్త బిల్డింగ్ నిర్మించారు. ఈ కోర్టులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి రమణ ప్రారంభించారు. కార్యక్రమంలో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ, హైకోర్టు జడ్జి జస్టిస్ నవీన్ రావు పాల్గొన్నారు.

వరంగల్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న CJI NV రమణ. కాళోజీ, దాశరథి కవితలు చదివి వినిపించారు. కాళోజీ స్ఫూర్తితో తెలుగులోనే మాట్లాడుతున్నట్లు చెప్పారు.

కోర్టుల్లో సరైన మౌలిక సదుపాయాలు ఉన్నప్పుడే సత్వర న్యాయం జరుగుతుందన్నారు CJI ఎన్వీరమణ. ఈ విషయంపై దృష్టి సారించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. న్యాయవ్యవస్థకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న మద్దతుని అభినందించారు.

వరంగల్‌ మాదిరిగానే అన్ని జిల్లాల్లోనూ ఆధునిక కోర్టు భవనాలు నిర్మించాలని ప్రభుత్వాని కోరారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ.

న్యాయవ్యవస్థలో ఉన్న ఖాళీలపై దృష్టి సారించాలని…అప్పుడే సత్వర న్యాయం జరుగుతుందన్నారు హైకోర్టు జడ్జి జస్టిస్ నవీన్ రావు.

వరంగల్ పర్యటన తర్వాత హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ…18వ స్నాతకోత్సవానికి చీఫ్‌ గెస్ట్‌గా హాజరయ్యారు CJI ఎన్వీ రమణ.

నల్సార్‌ యూనివర్సిటీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు CJI ఎన్వీరమణ. బర్కత్‌పురాలో చిన్న భవనంలో ప్రారంభమైన నల్సార్ వర్సిటీ నేడు ప్రపంచస్థాయికి ఎదిగిందన్నారు.

ఇవి కూడా చదవండి:

AP High Court: ఏపీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర్వులు తెలుగులో ఉండేలా చూడాలని హైకోర్టులో పిటిషన్‌

e-Shram: రైతులు ఈ స్కీమ్‌లో చేరితే రూ.2 లక్షల బెనిఫిట్‌.. ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు..!