CM KCR: దివ్యాంగుల పెన్షన్‌ పెంపు.. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి పాలాభిషేకాలు

|

Jun 11, 2023 | 7:00 AM

తెలంగాణలో దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్‌ను మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటనపై దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దివ్యాంగులకు శుభవార్త చెప్పారు. దివ్యాంగుల పింఛన్‌ను 1,000 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు

CM KCR: దివ్యాంగుల పెన్షన్‌ పెంపు.. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి పాలాభిషేకాలు
Cm Kcr
Follow us on

తెలంగాణలో దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్‌ను మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటనపై దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దివ్యాంగులకు శుభవార్త చెప్పారు. దివ్యాంగుల పింఛన్‌ను 1,000 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వచ్చే నెల నుంచి దివ్యాంగులకు 4,116 పింఛన్‌ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భారత జాగృతి ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోనీ ప్రధాన రహదారిపై సీఎం కేసీఆర్ ఫోటోలతో దివ్యాంగులు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి దివ్యాంగులు పాలాభిషేకం నిర్వహించారు. సీఎం కేసీఆర్ నాయకత్వం ఎల్లప్పుడు వర్ధిల్లాలని.. సొంత కుటుంబ సభ్యులే పట్టించుకోని తమను సీఎం కేసీఆర్ పెద్దదిక్కుగా మారారని తెలిపారు. అడగకముందే 3000 రూపాయల ఉన్న పెన్షన్ 4000 రూపాయలకు పెంచి మాకు అండగా నిలిచారని సంతోషం వ్యక్తం చేశారు.

దివ్యాంగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని భారత జాగృతి జిల్లా అధ్యక్షుడు తెలిపాడు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, పెన్షన్లు ఏ రాష్ట్రంలో కూడా ఇంత అద్భుతంగా అమలు కావడం లేదన్నారు. దివ్యాంగులు అందరితో సమానంగా ఎదగాలిఅన్నదే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి