AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: లింగనిర్ధారణ కేంద్రాలపై పోలీసుల ఉక్కుపాదం.. స్కానింగ్‌ మిషిన్లు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్‌.

లింగనిర్ధారణ కేంద్రాలు, గర్భస్రావాలు చేసిన ఆసుపత్రులపై పోలీసులు ఉక్కుపాదం మోపుఉతున్నారు. ఇందులో భాగంగానే కాసులకు కక్కుర్తిపడి ఆడపిల్లలను కడుపులోనే కడతేర్చుతున్న ముఠాను పోలీసులు ఇటీవల అరెస్ట్‌ చేశారు. తాజాగా లింగనిర్ధారణ స్కానింగ్ యంత్రాలను..

Telangana: లింగనిర్ధారణ కేంద్రాలపై పోలీసుల ఉక్కుపాదం.. స్కానింగ్‌ మిషిన్లు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్‌.
Warangal
Narender Vaitla
|

Updated on: Jun 11, 2023 | 6:35 AM

Share

లింగనిర్ధారణ కేంద్రాలు, గర్భస్రావాలు చేసిన ఆసుపత్రులపై పోలీసులు ఉక్కుపాదం మోపుఉతున్నారు. ఇందులో భాగంగానే కాసులకు కక్కుర్తిపడి ఆడపిల్లలను కడుపులోనే కడతేర్చుతున్న ముఠాను పోలీసులు ఇటీవల అరెస్ట్‌ చేశారు. తాజాగా లింగనిర్ధారణ స్కానింగ్ యంత్రాలను విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చేయకూడదనే నిబంధన ఉన్నా.. వరంగల్‌, హనుమకొండ జిల్లాల పరిధిలో కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా ఈ పరీక్షలు చేస్తున్నారు. ఆడపిల్ల వద్దనుకున్న వారికి అబార్షన్లు సైతం చేయిస్తున్నారు.

ఇటీవల ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి.. ఈ అక్రమాన్ని బట్టబయలు చేశారు అధికారులు. తాజాగా ప్రభుత్వ అనుమతులు లేకుండా లింగనిర్ధారణ స్కానింగ్ యంత్రాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు వరంగల్ పోలీసులు. వీరి వద్ద నుండి సూమారు 25 లక్షల విలువ చేసే 6 పోర్టబుల్, 12 ఫిక్సిడ్ స్కానింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఏపీకి చెందిన మల్లివుడి అశోక్ కుమార్, తాతపూడి కిరణ్ కుమార్ ఉన్నారు. ఈ ఇద్దరు అరెస్ట్ కు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ వివరాలు వెల్లడించారు.

లింగ నిర్ధారణకు పాల్పడుతూ ఈ మధ్యే అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు వేముల ప్రవీణ్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అశోక్ కుమార్, కిరణ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కొంతమంది డాక్టర్లను ఇప్పటికే జైలుకు పంపించామని వరంగల్ సీపీ రంగనాథ్ చెప్పారు. త్వరలో డాక్టర్లు, IMA ప్రతినిధులు, RMPలతోనూ సమావేశం నిర్వహిస్తామని వివరించారు. అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై కేసులు నమోదు, కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడి
చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడి
అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. వీడియో వైరల్
అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. వీడియో వైరల్
బైక్ ఆగింది..పని ఆగలేదు..రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో ఉద్యోగి
బైక్ ఆగింది..పని ఆగలేదు..రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో ఉద్యోగి
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది