Telangana Debts: తెలంగాణ అప్పులు ఇవే.. సంచలన వివరాలను వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం..

|

Feb 13, 2023 | 8:51 PM

తెలంగాణ ఎర్పడినప్పుడు ఉన్న అప్పు ఎంత? ప్రస్తుతం ఉన్న అప్పులెన్ని? ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న రుణం ఎంత? ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు తీసుకున్న లోన్లమాటేంటి? ఈ వివరాలన్నింటినీ లెక్కలతో సహా ప్రకటించింది కేంద్రం.. 

Telangana Debts: తెలంగాణ అప్పులు ఇవే.. సంచలన వివరాలను వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం..
Telangana Debts
Follow us on

తెలంగాణ ఎర్పడినప్పుడు ఉన్న అప్పు ఎంత? ప్రస్తుతం ఉన్న అప్పులెన్ని? ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న రుణం ఎంత? ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు తీసుకున్న లోన్లమాటేంటి? ఈ వివరాలన్నింటినీ లెక్కలతో సహా ప్రకటించింది కేంద్రం.. అభివృద్ధి.. అప్పులపై తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం మధ్య ఓ మినీ యుద్ధమే నడుస్తోంది. నిన్న అసెంబ్లీ వేదికగా కూడా CM కేసీఆర్ ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. BJP ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశం అన్ని రంగాల్లో వెనకబడిందని లెక్కలతో సహా వివరించింది. ఇప్పుడు కేంద్రం తెలంగాణ అప్పులపై లోక్‌సభలో కీలక ప్రకటన చేసింది..కాంగ్రెస్ MP ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి పంకజ్‌ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ఏపీ నుంచి విడిపోయి తెలంగాణ ఆవిర్భవించినపుడు ఉన్న అప్పు..75 వేల 577 కోట్లు. ఆ తర్వాత నుంచి ఏటా అది ఎలా పెరిగింది.? ఏ సంవత్సరంలో ఎంత అప్పుతీసుకున్నారు అన్న వివరాలను వెల్లడించింది కేంద్రం. 2020-21 నాటికి తెలంగాణ అప్పు 2 లక్షల 83 వేల 452 కోట్లుకు చేరినట్లు పేర్కొంది. అయితే ఇది కేవలం ప్రభుత్వం చేసిన అప్పుమాత్రమే.

ఇక ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు మరో లక్షా 50 వేల కోట్లు అప్పు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఈ మొత్తం కలిపితే తెలంగాణ రుణం 4 లక్షల 33 వేల 817 కోట్లకు చేరింది.

ఇవి కూడా చదవండి

కేంద్రం తీరుని తప్పుపడుతోంది BRS. తాము చేసిన అప్పు అభివృద్ధి రూపంలో కనిపిస్తోందని.. కానీ కేంద్రం తీసుకున్న రుణాలకు మాత్రం లెక్కలే లేవన్నది ఆ పార్టీ నేతల వర్షన్.

BRS-BJP మధ్య ఇప్పటికే హైవోల్టేజ్‌ హీట్ నడుస్తోంది.! ఇప్పుడు అప్పుల అంశం తెరపైకి రావడంతో వార్‌ నెక్స్ట్‌ లెవల్‌కు చేరింది. విమర్శలు, కౌంటర్లతో రాజకీయం రంజుగా మారుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..