ARCI Hyderabad Jobs 2023: నెలకు రూ.54 వేల జీతంతో హైదరాబాద్‌లోని ఏఆర్‌సీఐలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు అవసరం..
హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలార్జీ అండ్ న్యూ మెటీరియల్స్.. 18 రిసెర్చ్ అసోసియేట్, జూనియర్ రిసెర్చ్ ఫెలో, సీనియర్ రిసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలార్జీ అండ్ న్యూ మెటీరియల్స్.. 18 రిసెర్చ్ అసోసియేట్, జూనియర్ రిసెర్చ్ ఫెలో, సీనియర్ రిసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంఎస్సీ/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గేట్/యూజీసీ నెట్/నెట్‌లో అర్హత సాధించాలి. నియర్ రిసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి రెండేళ్ల పని అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 28 నుంచి 32 యేళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో మార్చి 13, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరీ అభ్యర్ధులు రూ.500లు అప్లికేషన్ రుసుముగా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు. స్క్రీనింగ్/షార్ట్‌లిస్టింగ్/పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి రిసెర్చ్ అసోసియేట్ పోస్టులకు నెలకు రూ.47,000ల నుంచి రూ.54,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులకు నెలకు రూ.31,000లు, సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులకు రూ.35,000లు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.




పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.