Hyderabad: అన్నా.. నువ్వు నిజంగానే తోపు. తమ్ముడి పెళ్లి పత్రికలు పంచేందుకు ఏకంగా హెలికాప్టర్‌నే రంగంలోకి దింపాడు
జీవితంలో ఒకేసారి జరగాలని కోరుకునే వేడుక వివాహం. అందుకే వీలైనంత వరకు వివాహాన్ని గొప్పగా జరుపుకోవాలని భావిస్తుంటాం. పెళ్లి చేసుకునే వారికి సరదాగా ఉన్నా వారి కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లి పనులతో క్షణం తీరిక లేకుండా ఉంటారు. పెళ్లి పనులు మొదలు కార్డులు పంచడం వరకు బిజీ...
జీవితంలో ఒకేసారి జరగాలని కోరుకునే వేడుక వివాహం. అందుకే వీలైనంత వరకు వివాహాన్ని గొప్పగా జరుపుకోవాలని భావిస్తుంటాం. పెళ్లి చేసుకునే వారికి సరదాగా ఉన్నా వారి కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లి పనులతో క్షణం తీరిక లేకుండా ఉంటారు. పెళ్లి పనులు మొదలు కార్డులు పంచడం వరకు బిజీ బిజీగా గడుపుతుంటారు. కారు లేదా బస్సుల్లో వెళ్లి కార్డులు ఇస్తుంటారు. ఒకవేళ నేరుగా వెళ్లి కార్డులు ఇవ్వలేనికి వారికి పోస్టులో పంపిస్తుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం పెళ్లి కార్డులను పంచడానికి ఏకంగా హెలికాప్టర్‌నే బుక్ చేసుకున్నాడు.
హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త మధు యాద్ సోదరుడి వివాహం ఈనెల 9వ తేదీన జరగనుంది. వీరి కుటుంబ సభ్యులు కొందరు ముంబయిలో నివాసం ఉంటున్నారు. దీంతో వారికి శుభలేఖలు ఇచ్చేందుకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్లారు. కుటుంబ సభ్యులకు పెళ్లి కార్డులను అందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు మధు యాదవ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అన్న నువ్వు నిజంగా తోపు, తమ్ముడి పెళ్లి కార్డులు పంచడానికి ఏకంగా హెలికాప్టర్‌ను బుక్ చేయడం నిజంగా సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి పెళ్లి కార్డులతో ఇలా అందరి దృష్టిని ఆకర్షించిన మధు, పెళ్లిని ఇంకా ఎంత వేడుకగా జరుపుతారో అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..