AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో వేగంగా మారుతున్న రాజకీయాలు.. దూకుడుగా వ్యవహరిస్తున్న ప్రధాన పార్టీలు.. ఇవాళ ఏం జరిగిందంటే..

Telangana Political: తెలంగాణలో ఎన్నికల హీట్‌ వచ్చేసింది. ప్రధాన పార్టీలన్నీ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అధికారమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. బీఆర్‌ఎస్‌- బీజేపీకి బీ టీమ్‌ అని కాంగ్రెస్‌ విమర్శిస్తే, బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ ఒక్కటేనని బీజేపీ సెటైర్‌ వేస్తోంది. ఐతే బీజేపీ-కాంగ్రెస్‌లు అంతర్గత మిత్రులని అధికార బీఆర్‌ఎస్‌ విమర్శిస్తోంది. ఇంతకీ ఎవరికి ఎవరు బీ టీమ్..? ప్రజల్లో కన్ఫ్యూజన్‌ క్రియేట్‌ చేస్తూ పొలిటికల్‌ హీట్‌ రేపుతున్నాయి ప్రధానపార్టీలు.

తెలంగాణలో వేగంగా మారుతున్న రాజకీయాలు.. దూకుడుగా వ్యవహరిస్తున్న ప్రధాన పార్టీలు.. ఇవాళ ఏం జరిగిందంటే..
Telangana Political
Sanjay Kasula
|

Updated on: Jun 23, 2023 | 9:18 PM

Share

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడేకొద్దీ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఎత్తులు, పై ఎత్తులతో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఒకపార్టీ.. మరోపార్టీకి బీ టీమ్‌ అంటూ పొలిటికల్‌ హీటెక్కిస్తున్నాయి. అంతర్గతంగా పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టిన కాంగ్రెస్‌..చేరికలపై ఫోకస్ పెంచి మరీ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో సమావేశం అయిన నేతలు ఇతర నాయకులను కలిసే పనిలో పడ్డారు. అటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ. తెలంగాణ ఒక్కటే కాదు మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ ఘడ్‌, రాజస్తాన్‌ వంటి రాష్ట్రాల్లోనూ బీజేపీ కనుమరుగు అవుతుందన్నారు రాహుల్‌.

కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ వచ్చిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది. రాష్ట్రానికి చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించడానికి వెళ్లిన కేటీఆర్‌..కేంద్రం తీరుపై విమర్శలు గుప్పించారు. బీజేపీ, కాంగ్రెస్‌ ఇద్దరు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు కేటీఆర్‌. మంత్రి కేటీఆర్‌ ఢిల్లీకి వచ్చిన ఉద్దేశ్యమేంటో ప్రజలందరికీ తెలుసన్నారు తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే. గత నాలుగేళ్లుగా లేని సమస్యలు ఇప్పుడే వచ్చాయా అని ఆయన ప్రశ్నించారు.

మరోవైపు తెలంగాణపై ఫోకస్‌ పెట్టారు ఢిల్లీ బీజేపీ పెద్దలు. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో అసంతృప్తిగా ఉన్నారనే సమాచారంతో బీజేపీ అధిష్ఠానం వారిద్దరిని ఢిల్లీకి పిలిచింది. వారిద్దరితో మాట్లాడి, పార్టీలో ఉన్న అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని విధంగా కేడర్‌ అంతా సమన్వయంతో పనిచేయాలని అధిష్ఠానం ఆదేశించనున్నట్లు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

ఊరంతా ఒకటే పేరు..గూళ్యం గ్రామ ప్రత్యేక నామకరణ సంప్రదాయం తెలిస్తే
ఊరంతా ఒకటే పేరు..గూళ్యం గ్రామ ప్రత్యేక నామకరణ సంప్రదాయం తెలిస్తే
ప్రయాణికుల మనసులు దోచేస్తున్న ఆర్టీసీ..
ప్రయాణికుల మనసులు దోచేస్తున్న ఆర్టీసీ..
భార్యాభర్తల కోసం బెస్ట్ స్కీమ్‌.. రూ.2 లక్షలపై రూ.90 వేల వడ్డీ
భార్యాభర్తల కోసం బెస్ట్ స్కీమ్‌.. రూ.2 లక్షలపై రూ.90 వేల వడ్డీ
ఐపీఎల్ 2026 వేలం ఎప్పుడు.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే ?
ఐపీఎల్ 2026 వేలం ఎప్పుడు.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే ?
భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..!
భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..!
డిసెంబర్ 31 లోపు ఈ 5 పనులను పూర్తి చేయండి.. లేకుంటే ఇబ్బందులే..
డిసెంబర్ 31 లోపు ఈ 5 పనులను పూర్తి చేయండి.. లేకుంటే ఇబ్బందులే..
మరణించిన వ్యక్తి బంధువులలో ఎవరు తల గుండు చేయించుకోవాలి..?
మరణించిన వ్యక్తి బంధువులలో ఎవరు తల గుండు చేయించుకోవాలి..?
భారత్-దక్షిణాఫ్రికా మొదటి టీ20లో ఐదు భారీ రికార్డులు బ్రేక్
భారత్-దక్షిణాఫ్రికా మొదటి టీ20లో ఐదు భారీ రికార్డులు బ్రేక్
భారత్‌లో అమ్ముడవుతున్న అత్యంత ఖరీదైన కారు..ధర తెలిస్తే షాకవుతారు
భారత్‌లో అమ్ముడవుతున్న అత్యంత ఖరీదైన కారు..ధర తెలిస్తే షాకవుతారు
పొద్దున్నే చాయ్ బిస్కెట్లు తింటున్నారా..? ఎంత డేంజరో తెలుసుకోండి!
పొద్దున్నే చాయ్ బిస్కెట్లు తింటున్నారా..? ఎంత డేంజరో తెలుసుకోండి!