KCR: కాంగ్రెస్ పాలనలో బోనస్ బోగస్‌గా మారింది.. కేసీఆర్ అటాక్
తెలంగాణ జెండాను ఆకాశమంత ఎత్తుకు ఎత్తిన గడ్డ కరీంనగర్ అన్నారు. మొన్న ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారన్న కేసీఆర్, కాంగ్రెస్ ఎన్నికల ముందు ఆరు చందమామలను చూపెట్టారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయి లేకుండా మాట్లాడుతున్నారన్న కేసీఆర్.. తాము మాట్లాడితే రేపు ఈ సమయం వరకు...
మంగళవారం కరీంనగర్‌లో నిర్వహించిన కదనభేరి బహిరం సభలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అమలు చేసిన పథకాలను అమలు చేసే దమ్ము లేదా అని రేవంత్‌ను ఉద్దేశిస్తూ కేసీఆర్ ప్రశ్నించారు. అంతకు ముందు సభ మొదలు కాగానే మాట్లాడిన కేసీఆర్.. దిశదశ లేకుండా.. అన్నమో రామచంద్రా అని అలమటిస్తున్న తెలంగాణ కోసం.. హైదరాబాద్‌లోని జల దృశ్యం నుంచి ఆనాడు పిడికెడు మందితో జైతెలంగాణ అని బయలుదేరానని కేసీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణ జెండాను ఆకాశమంత ఎత్తుకు ఎత్తిన గడ్డ కరీంనగర్ అన్నారు. మొన్న ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారన్న కేసీఆర్, కాంగ్రెస్ ఎన్నికల ముందు ఆరు చందమామలను చూపెట్టారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయి లేకుండా మాట్లాడుతున్నారన్న కేసీఆర్.. తాము మాట్లాడితే రేపు ఈ సమయం వరకు తిడుతాన్నారు. మిషన్ భగీరథను నడిపే తెలివి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా? అని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలని లేదంటే పథకాలు అడిగితే నిజంగానే చెప్పుతో కొడతారని అన్నారు.
ప్రజలు ఆలోచించాలి..
కరోనా వేళ ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తాము రైతుబంధు ఇచ్చామని, కాంగ్రెస్ వాళ్లు మాత్రం ఇవ్వలేకపోతున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత బలంగా గులాబీ జెండా ఎగిరితే అంత బలంగా తాము అభివృద్ధిపై పోరాడుతామన్నారు. జిల్లాకో నవోదయ ఇవ్వాల్సి ఉన్నా ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని కేసీఆర్ ప్రశ్నించారు. రైతుల సంక్షేమం కోసం చరణ్ సింగ్ లాంటి రైతుబిడ్డలు కూడా పెట్టని పథకాలు తీసుకొచ్చామన్నారు. కరీంనగర్ ప్రజలు ఈ విషయాలన్నీ ఆలోచించి ఓటు ఏవయాలన్నారు. అసమర్థ కాంగ్రెస్ నాయకుల పాలనలో బోనస్ బోగస్‌గా మారిపోయిందన్నారు.
రాద్ధాంతం చేస్తున్నారు..
మేడిగడ్డలో చిన్న కాంపోనెంట్‌లో ఏదో జరిగితే దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. రెండు పిల్లర్లు కుంగితే భారతే మునిగిపోతున్నట్టు బొబ్బలు పెడుతున్నారన్నారు. నా కళ్ల ముందే నీళ్లు లేక, కరెంట్ లేక రైతులు పొలాలకు నిప్పు పెడుతున్నారు, పశువులను మేపుతున్నారన్నారు. గ్రామాల్లో ప్రజలంతా చర్చలు పెట్టాలి. బీఆర్ఎస్ తెలంగాణా గళం, దళం, బలం అని కేసీఆర్ అభివర్ణించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఒక్క ఎకరం పొలమైన ఎండి పోయిందా అన్న కేసీఆర్.. ఇప్పుడేం రోగం వచ్చిందన్నారు. వచ్చే రెండు రోజుల్లో తాను టీవీలో టీవీలో కూర్చుంటానని, కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పతనం గురించి ఇంటింటికి చేరేలా చేస్తానన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..