
Telangana: తెలంగాణ రాజకీయాలు రంజుగా మారాయి. ఎప్పుడూ లేని విధంగా పొత్తులపై హాట్‌హాట్ డిస్కషన్ నడుస్తోంది.! టి.కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్‌ను మార్చడానికి బీఆర్‌ఎస్‌తో పొత్తు అంశమే కారణం అన్న వార్త… సహజంగానే ప్రకంపనలు రేపుతోంది..! బీజేపీని ఎదుర్కోవడానికి ఈ రెండు పార్టీలు ఏకం అయ్యాయని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని.. ఇప్పుడు అదే నిజం అయ్యిందని ఆరోపిస్తున్నారు కమలనాథులు. అసలు తెలంగాణలో ఉన్నది కేసీఆర్ కాంగ్రెస్సే అన్నది బీజేపీ వర్షన్..!
కాంగ్రెస్ వర్షన్ మరోలా ఉంది. అసలు తమ మధ్య పొత్తుల అంశమే చర్చకు రాలేదని అంటోంది. 2023లో సింగిల్‌గానే పోటీ చేస్తామని.. ఇదే విషయాన్ని రాహుల్ ఎప్పుడో చెప్పారని గుర్తుచేస్తోంది. బీజేపీ-కాంగ్రెస్ వాదనలు, ఆరోపణల్ని కొట్టిపారేస్తోంది బీజేపీ. 2014, 2018 ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేసి అధికారంలోకి వచ్చిన తమకు.. మరో పార్టీతో దోస్తీ కోసం పాకులాడాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్….ఈ మూడు పార్టీలు సింగిల్‌గానే పోటీ చేస్తున్నామని స్పష్టం చేస్తున్నాయి.. కానీ, ఎన్నికల టైమ్ దగ్గరపడుతున్న వేళ..పొత్తుల ముచ్చట్లు తెరపైకి వస్తుండటంతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..