Rani Rudrama Devi: నేలకొరిగిన రాణి రుద్రమ విగ్రహం.. పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు

|

Mar 21, 2023 | 8:33 AM

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలోని లక్నవరం క్రాస్ వద్ద వీరనారి రాణి రుద్రమ విగ్రహం విరిగి పడింది. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Rani Rudrama Devi: నేలకొరిగిన రాణి రుద్రమ విగ్రహం.. పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు
Rani Rudrama Statue
Follow us on

దాదాపు మూడు శతాబ్దాల పాటు తెలుగు నేలనేలిన తెలుగింటి ఆడబడుచు.. పౌరుషానికి ప్రతీక..  కాకతీయుల వంశానికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టి..  ధ్రువతారగా వెలిగిన మహారాణి రాణి రుద్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. రాణి రుద్రమ గొప్పతనాన్ని నేటి తరానికి గుర్తు తెలియజేసే విధంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో రుద్రమ దేవి విగ్రహాలు కొలువుదీరాయి. తాజాగా ఓ రాణి రుద్రమ విగ్రహం నేలకొరిగింది. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన తెలంగాణా ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలోని లక్నవరం క్రాస్ వద్ద వీరనారి రాణి రుద్రమ విగ్రహం విరిగి పడింది. భారీగా వీచిన ఈదురు గాలులకు విగ్రహం నేలకొరిజరిగిందని స్థానికులు చెబుతున్నారు. అయితే మరోవైపు రాణి రుద్రమ విగ్రహాన్ని ఎవరైనా గుర్తు తెలియని దుండగులు ధ్వసం చేశారా..? లేక గాలి వానకు విరిగిపడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. ఈమె తండ్రి గణపతిదేవునికి పుత్ర సంతానం లేదు. అందువలన రుద్రాంబను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేసాడు. నిరవద్యపుర(నిడదవొలు)పాలకుడు వీరభద్ర ఛాళుక్యుడు ఈమె భర్త. రుద్రమదేవికి ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ముమ్మడమ్మ. ఈమె మహాదేవుని భార్య. వీరి పుత్రుడే ప్రతాప రుద్రుడు. రుద్రమాంబ ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిషేకం చేసింది.

ఇవి కూడా చదవండి

కాకతీయ వంశంలో అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు గణపతి దేవుడు కుమార్తె రుద్రమాంబ. 1261 సంవత్సరం నుంచి 1296 వరకూ దాదాపు 35 ఏళ్లపాటు కాకతీయ రాజ్యాన్ని పాలించింది. తనకు కుమారులు లేకపోవడంతో కుమార్తెను రుద్రదేవగా పెంచుకున్నాడు. కేవలం 14ఏళ్ల లేత ప్రాయంలోనే తండ్రి గణపతి దేవ అండతో అధికారాన్ని చేపట్టింది రాణి రుద్రమ. రాణిగా పట్తభిషేకాన్ని వ్యతిరేకించిన సామంతరాజులను తన పరిపాలనా దక్షతతో అణచివేసింది.

దక్షిణాదిని పాలించే చోళులు, మరాఠా ప్రాంత యాదవులను సమర్ధవంతంగా ఎదుర్కొని రాజ్యాన్ని కాపాడడమేకాదు.. సుభిక్షంగా పాలించిన యోధురాలు రాణి రుద్రమ. కాకతీయ రాజ్యంపై పొరుగు ప్రాంత రాజులు కన్నెత్తి చూడకుండా కంటికి రెప్పలా కాపాడిన ధీరవనిత రాణి రుద్రమ. అప్పటి ఏకశిలా నగరం.. ప్రస్తుతం వరంగల్ లోని కోటను శత్రు దుర్భేద్యంగా నిర్మించింది. ఒంటిరాతి కొండపై కోట నిర్మాణాన్ని తండ్రి గణపతి దేవుడు ప్రారంభిస్తే దానిని పూర్తిచేసిన ఘతన రుద్రమ దేవిది. తండ్రి బాటలో ప్రజానురంజకంగా పాలించిన రుద్రమ దేవి కాకతీయుల పేరు చెప్పగానే ముందుగా స్మరణకు వస్తుంది. కాకతీయుల్లోనే రాయగజకేసరి బిరుదాంకితురాలై కీర్తిగాంచింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..