AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

40 మంది బౌన్సర్ల మధ్యలో తాళికట్టిన వరుడు..

పెళ్లంటే నూరేళ్ల జ్ఞాపకం..జీవితంలో ఒకేసారి వచ్చే సంబరం కావడంతో ఉన్నంతలో వైభవంగా చేసుకుంటారు. వివాహవేడుకలో కొందరు గుర్రపు బగ్గీలపై వధువరులను ఊరేగిస్తే..మరికొందరు వైరైటీగా పూల పల్లకీలో తోడుకుని వస్తారు. ఇలా ఎవరికి ఉన్నంతలో వారు వైభవంగా జరుపుకుంటారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం తన పెళ్లిలో ఆర్భాటం కోసం ఏకంగా 40 మంది...

40 మంది బౌన్సర్ల మధ్యలో తాళికట్టిన వరుడు..
Jyothi Gadda
| Edited By: |

Updated on: Feb 28, 2020 | 3:05 PM

Share

పెళ్లంటే నూరేళ్ల జ్ఞాపకం..జీవితంలో ఒకేసారి వచ్చే సంబరం కావడంతో ఉన్నంతలో వైభవంగా చేసుకుంటారు. వివాహవేడుకలో కొందరు గుర్రపు బగ్గీలపై వధువరులను ఊరేగిస్తే..మరికొందరు వైరైటీగా పూల పల్లకీలో తోడుకుని వస్తారు. ఇక ఇటీవల కాలంలో ప్రీ వెడ్డింగ్ షోలు కూడా పెళ్లి వేడుకలో హల్ చల్ చేస్తున్నాయి. ఇలా ఎవరికి ఉన్నంతలో వారు వైభవంగా జరుపుకుంటారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం తన పెళ్లిలో ఆర్భాటం కోసం ఏకంగా 40 మంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నాడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఓ వివాహవేడుక అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. పెళ్లిలో వరుడు చేసిన హంగామా చూసిన వచ్చిన బంధువులంతా ముక్కున వేలేసుకున్నారు. జిల్లాలోని టేకులపల్లి మండలం సింగ్యతాండాకు చెందిన బానోతు పుల్సింగ్ కుమారుడు రవితేజ.. ములుగు జిల్లాకు చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే, పెళ్లిలో తన చుట్టూ, వెంటనే నలుగురు బౌన్సర్లు, మండపంలో అక్కడడక్కడా కలిపి మొత్తం 40 మందిని నియమించుకున్నాడు. వారంతా సఫారీలు ధరించి నల్ల కళ్లజోళ్లతో దర్శనం ఇచ్చారు. పెళ్లి కొడుకు ఎక్కడికి వెళ్లినా అతని వెంటే నలుగురు బౌన్సర్లు, మిగిలిన వారు మండపం అంతటా నిలబడి కనిపించారు. కారు వద్ద మరికొందరు ఇలా ఎక్కడ చూసినా బౌన్సర్లే దర్శనమిచ్చారు.

పెళ్లికి వచ్చిన వారంతా అక్కడ ఏం జరుగుతుందో తెలియక వింతగా చూస్తుండిపోయారు. ఓ సాధారణ వ్యక్తి 40 మంది బౌన్సర్లను నియమించుకోవడం ఏంటని ఆశ్చర్యపోయారు. సెలబ్రిటీలకు సైతం ఈ స్థాయిలో భద్రత ఉండదంటూ విడ్డూరం వ్యక్తం చేశారు. ఇక్కడో విశేషముంది.. పెళ్లి కోసం వాడిన పూలను ప్రత్యేకంగా రాజమండ్రి నుంచి తెప్పించుకున్నాడట. ఇన్నీ ప్రత్యేకతలో జరిగిన ఓ సామాన్యుడి వివాహవేడుక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

భయపెడుతోన్న వాతావరణ శాఖ.. గడపదాటాలంటే ప్రజల్లో వణుకు..
భయపెడుతోన్న వాతావరణ శాఖ.. గడపదాటాలంటే ప్రజల్లో వణుకు..
18 ఏళ్లకే ఇండస్ట్రీలో సంచలనం.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుంది..
18 ఏళ్లకే ఇండస్ట్రీలో సంచలనం.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుంది..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..