తెలంగాణ చరిత్రలోనే రికార్డ్.. గరిష్ఠ స్థాయిలో విద్యుత్‌ వినియోగం!

వేసవి సీజన్ లో ఎక్కువగా కరెంటు వినియోగం నమోదవుతుంటుంది. అయితే ఈసారి మాత్రం తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో కరెంటు డిమాండు పెరిగింది. ఈ రోజు (శుక్రవారం) ఉదయం 7.52 గంటలకు రికార్డు స్థాయిలో కరెంటు వినియోగం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 13,168 మెగావాట్ల విద్యుత్‌ వినియోగించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2014 మార్చి 23న 13,162 మెగావాట్ల అత్యధిక డిమాండ్‌ నమోదు కాగా ప్రస్తుతం ఆ రికార్డు చెరిగిపోయింది. గత కొన్ని రోజులుగా తెలంగాణలో విద్యుత్‌ […]

తెలంగాణ చరిత్రలోనే రికార్డ్.. గరిష్ఠ స్థాయిలో విద్యుత్‌ వినియోగం!
Follow us

| Edited By:

Updated on: Feb 28, 2020 | 5:50 PM

వేసవి సీజన్ లో ఎక్కువగా కరెంటు వినియోగం నమోదవుతుంటుంది. అయితే ఈసారి మాత్రం తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో కరెంటు డిమాండు పెరిగింది. ఈ రోజు (శుక్రవారం) ఉదయం 7.52 గంటలకు రికార్డు స్థాయిలో కరెంటు వినియోగం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 13,168 మెగావాట్ల విద్యుత్‌ వినియోగించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2014 మార్చి 23న 13,162 మెగావాట్ల అత్యధిక డిమాండ్‌ నమోదు కాగా ప్రస్తుతం ఆ రికార్డు చెరిగిపోయింది. గత కొన్ని రోజులుగా తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతూ ఉంటడం గమనార్హం.