Bowenpally Kidnap Case: బోయినపల్లి కిడ్నాప్ కేసులో జగత్ విఖ్యాథ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ .. రేపు విచారణ

Bowenpally Kidnap Case: బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసు వ్యవహారం ఇంకా కొనసాగుతోంది. ఈ కేసులో జగత్‌ విఖ్యాథ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ కోసం దాఖలు చేశారు....

Bowenpally Kidnap Case: బోయినపల్లి కిడ్నాప్ కేసులో జగత్ విఖ్యాథ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ .. రేపు విచారణ
Follow us
Subhash Goud

|

Updated on: Jan 19, 2021 | 6:23 PM

Bowenpally Kidnap Case: బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసు వ్యవహారం ఇంకా కొనసాగుతోంది. ఈ కేసులో జగత్‌ విఖ్యాథ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్ దాఖలు చేశారు. సికింద్రాబాద్‌ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన జగన్‌ విఖ్యాత్‌ రెడ్డి.. అఖిలప్రియ కూడా మరోసారి సెషన్స్‌ కోర్టులో బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌, జగత్‌ విఖ్యాత్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై బుధవారం కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసు వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు వివిధ కోణాలు జరుపుతున్నారు. ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు.. ఇప్పటి వరకు 19 మందిని అరెస్టు చేశారు. అయితే హఫీజ్‌పేట లాండ్‌ వ్యవహారంలోనే ఈ కిడ్నాప్‌ చేసినట్లు అఖిలప్రియ పోలీసు కస్టడిలో తెలిపారు. ఆమె ఇచ్చిన వివరాల ఆధారంగానే కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

కాగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న భార్గవ్‌రామ్‌ ముందస్తు బెయిల్‌ కోసం సికింద్రాబాద్‌ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే . ప్రవీణ్‌ రావు  సోదరుల కిడ్నాప్‌ కేసులో ఏ-3 నిందితునిగా ఉన్న తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించాడు. కిడ్నాప్ లో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన పిటిషన్​లో పేర్కొన్నాడు. అఖిలప్రియ పేరును కూడా ఈ కేసులో అన్యాయంగా చేర్చారని.. ఏ-1 గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని ఏ2 గా మార్చి కేవలం నోటీసులు ఇచ్చి పంపారని పిటిషన్​లో తెలిపాడు. వ్యాపారరీత్యా హైదరాబాద్​లో సెటిల్ అయ్యానని.. పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి సహకరిస్తానని పేర్కొన్నారు. దర్యాప్తునకు ఎలాంటి ఆటంకం లేకుండా సహరిస్తానని భార్గవ్ తన పిటిషన్​లో పేర్కొన్నాడు. భార్గవరామ్ ముందస్తు బెయిల్ పిటిషన్​పై బోయిన్​పల్లి పోలీసులకు నోటీసులు జారీ చేసిన సికింద్రాబాద్​ కోర్టు.. ఈ నెల 21వ తేదీకి విచారణ వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Also Read: Devineni Uma Released: పమిడిముక్కల పోలీస్ స్టేషన్‌ నుంచి టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా విడుదల