
అసలే అమావాస్య.. అర్ధరాత్రి చిమ్మ చీకటిలో ఊరు అంతా నిద్రపోయారు.. తెల్లారేసరికి ఇంటి ముందు వరండాలో చూస్తే ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. అసలు ఏమైంది అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారి గూడెంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. నారంవారి గూడెం గ్రామంలో ఇంటి వరండాలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో క్షుద్రపూజలు ఇంటి యజమానులతో పాటు స్థానికులకు భయబ్రాంతులు కలిగించాయి.
ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో
అల్లాడి పద్మ ఇంటిలో అందరూ రాత్రి నిద్రించాక.. తెల్లవారుజామున ఇంటి వరండా శుభ్రం చేస్తుండగా ఒక ఎర్రటి గుడ్డలో ఉంచిన ఒక జంతు పుర్రె, నిమ్మకాయ, పసుపు, కుంకుమ పూజలు చేసినట్టు సామగ్రి ఉండటంతో ఆమె భయబ్రాంతులకు గురై చుట్టుప్రక్కల స్థానికులను పిలిచి విషయం చెప్పడంతో.. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ఆ ప్రదేశాన్ని చూసి నిన్న అమావాస్య కావడంతో ఎవరో క్షుద్రపూజలు చేశారని భయబ్రాంతులకు గురై పోలీసులకు సమాచారం తెలిపారు. సంఘటన జరిగిన ప్రదేశానికి స్థానిక పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.
ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..