AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay: 10 రోజులపాటు ఆ నియోజకవర్గాలే టార్గెట్‌గా.. ఇవాళ్టి నుంచి బండి సంజయ్‌ నాలుగో విడత పాదయాత్ర..

Praja Sangrama Yatra: ప్రజా సంగ్రామ యాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం చిత్తారమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.

Bandi Sanjay: 10 రోజులపాటు ఆ నియోజకవర్గాలే టార్గెట్‌గా.. ఇవాళ్టి నుంచి బండి సంజయ్‌ నాలుగో విడత పాదయాత్ర..
Bandi Sanjay Kumar
Sanjay Kasula
|

Updated on: Sep 12, 2022 | 8:57 AM

Share

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం చిత్తారమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ జెండా ఊపి యాత్రను ప్రారంభిస్తారు. అనంతరం కట్టమైసమ్మను దర్శించుకుని పూజులు నిర్వహిస్తారు. అనంతరం సూరారం కాలనీలోని రాంలీలా మైదానంలో ప్రారంభ సభ ఉంటుంది. ప్రజా సంగ్రామయాత్ర నాలుగో విడత 10 రోజుల పాటు సాగనుంది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కుత్బుల్లాపూర్, కూకట్​పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్​తో పాటు.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.

ఈ యాత్రలో మొత్తం 115.3 కిలోమీటర్లు నడవనున్నారు. దారి పొడవునా ప్రజా సమస్యలు తెలుసుకోనున్నారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో 11 వందల 28 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. మొత్తం 18 జిల్లాలు, 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేశారు. ఇప్పుడు చేపట్టే యాత్రతో కలిపి.. 8 పార్లమెంట్​ నియోజకవర్గాలతో 48 అసెంబ్లీ సెగ్మెంట్లలో పూర్తి అవుతుంది.

పాదయాత్రలో భాగంగా ప్రతి రోజు సగటున బండి సంజయ్ 11 కిలోమీటర్ల మేర యాత్రను సాగించనున్నారు. గతంలో రోజుకు సుమారుగా 15 కిలోమీటర్లకు పైగా నడిచారు. మహా నగరంలో సమస్యలు అధికంగా ఉండటంతో అన్ని వర్గాల ప్రజలను కలిసి, వారి సమస్యలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో రోజుకు 10 నుంచి 11 కిలోమీటర్లకే కుదించుకున్నారు.

ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విమోచన వేడుకలకు హాజరుకానున్న నేపథ్యంలో.. ఆ ఒక్కరోజు యాత్రను వాయిదా వేసుకుంటున్నారు. 22న పెద్ద అంబర్​పేట ఔటర్ రింగు రోడ్డు వద్ద.. పాదయాత్రను బండి సంజయ్ ముగించనున్నారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే