Munugode: శరవేగంగా మారుతున్న పరిణామాలు.. ముఖ్య నేతలతో పాల్వాయి స్రవంతి భేటీ.. గెలుపు వ్యూహాలపై చర్చ

మునుగోడులో (Munugode) త్వరలో జరగబోయే ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ పార్టీ సమాయత్తమవుతోంది. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రణాళికలు రచిస్తోంది. గెలుపు వ్యూహాలపై పార్టీ నేతలు దిశానిర్దేశం...

Munugode: శరవేగంగా మారుతున్న పరిణామాలు.. ముఖ్య నేతలతో పాల్వాయి స్రవంతి భేటీ.. గెలుపు వ్యూహాలపై చర్చ
Munugodu
Follow us

|

Updated on: Sep 12, 2022 | 9:39 AM

మునుగోడులో (Munugode) త్వరలో జరగబోయే ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ పార్టీ సమాయత్తమవుతోంది. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రణాళికలు రచిస్తోంది. గెలుపు వ్యూహాలపై పార్టీ నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిశారు. మునుగోడు నియోజకవర్గంలో తనకు పూర్తి సహకారం అందించాలని కోరారు. రెండు రోజులుగా కీలక నేతలను కలుస్తున్నారు. వారి మద్దతు, సహకారం అందివ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) తో సమావేశానికి ముందే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి తనకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 18 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిస్తుండటంతో పార్టీ నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు రేవంత్‌ రెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. మునుగోడు టికెట్‌ ఆశించిన కృష్ణారెడ్డి, పల్లె రవి కుమార్‌, కైలాస్‌లతో సమావేశమయ్యారు. అభ్యర్థి ఎంపిక విషయంలో తీసుకున్న ప్రమాణాలు, పార్టీ పరిస్థితిని నేతలకు వివరించారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ఈ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారంతో దూసుకుపోతున్నారు.

మరోవైపు.. మునుగోడు ఉప ఎన్నికలపై మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ తీరుపై విరుచుకుపడ్డారు. బీజేపీకి ఓటేస్తే సంక్షేమ పథకాలను అడ్డుకుంటారని విమర్శించారు. రైతుల వ్యవసాయ బావుల వద్ద విద్యుత్తు మీటర్లు తప్పవని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కష్టాలు ఎదుర్కొన్న తెలంగాణ.. నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తూ దేశంలో ఆదర్శంగా నిలిచిందన్నారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడటానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కారణమని విమర్శించారు.

కాగా మునుగోడు లో బీజేపీ విజయానికి పార్టీ నేతలు శాయాశక్తులా కృషి చేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్‌బన్సల్‌ సూచించారు. మద్యం, డబ్బుతో ఓట్ల కోసం వచ్చే టీఆర్ఎస్ తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రజలకు వివరించారు. మునుగోడు మండల కేంద్రంలోనే తాను క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుంటామని, కార్యకర్తలు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం