AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teenmar Mallanna – KTR: తీన్మార్‌ మల్లన్న వ్యవహారశైలిపై బీజీపీ హైకమాండ్ సీరియస్!

బాడీ షేమింగ్‌ చేయడం మహానేరం. పైగా అది పిల్లలపైనా ప్రతాపం.!. ఇది ఇప్పుడు సామాన్య జనం నుంచి వినిపిస్తున్న మాట. సొంత పార్టీ నేతలు సైతం తీన్మార్ మల్లన్న వ్యవహారశైలిని తప్పుపడుతున్నారు. 

Teenmar Mallanna - KTR: తీన్మార్‌ మల్లన్న వ్యవహారశైలిపై బీజీపీ హైకమాండ్ సీరియస్!
Teenmar Mallanna
Ram Naramaneni
|

Updated on: Dec 25, 2021 | 3:26 PM

Share

కొంచమైనా సిగ్గు ఉండాలి..! నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు వాగడం.! సోషల్ మీడియా ఉంది కదా అని అడ్డగోలు పోస్టులు పెట్టడం..! ఇదేనా సంస్కారం? ఇదేనా ఇన్నాళ్లుగా నేర్చుకున్న జ్ఞానం? ఇదేనా రాజకీయం.! ఇవేనా పాటించాల్సిన విలువలు. ఇదేనా సభ్య సమాజానికి, భావితరాలకు ఇవ్వాల్సిన మెసేజ్. తీన్మార్‌ మల్లన్నపై నెటిజన్ల ఆగ్రహం ఇది.

దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. అన్ని లిమిట్‌లనూ క్రాస్‌ చేసి ఓవరాక్షన్ చేస్తే, ఇష్టానుసారంగా కామెంట్స్‌ చేస్తే, కుటుంబాలను రాజకీయాల్లోకి లాగితే.. ఎవరూ హర్షించరు. ఇప్పుడు తీన్మార్‌ మల్లన్న విషయంలోనూ ఇదే జరుగుతోంది. చెడపకురా చెడేవు అన్నట్లుగా..ఎవరినో ఏదో చేద్దానకుంటే అది కాస్తా బూమరాంగ్‌ అయి.. రివర్స్‌ పంచ్‌లు పడుతున్నాయి.

రాజకీయాలు వేరు. వ్యక్తిగత జీవితం వేరు. రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు. తప్పుల్ని ప్రశ్నించవచ్చు. అవినీతిపై నిగ్గదీసి అడగవచ్చు. నిలదీయవచ్చు. చేతనైతే ఆధారాలతో సహా బయటపెట్టవచ్చు. కానీ … పాలిటిక్స్‌లోకి ఫ్యామిలీని లాగడం ఏంటి? పైగా ఏ మాత్రం సంబంధం లేని చిన్నపిల్లలను టార్గెట్ చేయడం ఏంటి? ఇదే పెద్ద తప్పు అయితే..బాడీ షేమింగ్‌ చేయడం మహానేరం. పైగా అది పిల్లలపైనా ప్రతాపం.!. ఇది ఇప్పుడు సామాన్య జనం నుంచి వినిపిస్తున్న మాట. సొంత పార్టీ నేతలు సైతం తీన్మార్ మల్లన్న వ్యవహారశైలిని తప్పుపడుతున్నారు.

తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలపై బీజేపీ నాయకత్వం ఆరా తీస్తోంది. కేటీఆర్ కుటుంబ సభ్యులను విమర్శించడంపై సీరియస్‌గా ఉంది పార్టీ నాయకత్వం. తీన్మార్‌ మల్లన్నకు వార్నింగ్‌ ఇచ్చే ఆలోచనలో ఉంది. వ్యక్తిగత విమర్శలు తమ పార్టీ సిద్ధాంతం కాదంటున్నారు బీజేపీ నాయకుడు ప్రకాష్‌రెడ్డి.

ఇక తీన్మార్‌ మల్లన్నపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది.. కేటీఆర్‌ కుమారుడు హిమాన్షుపై..అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్‌ఎస్‌ ఐటీ సెల్‌ కంప్లైంట్ చేసింది. మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరింది. అటు తనపైనే దాడి చేశారంటూ మల్లన్న కూడా మేడిపల్లి స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Also Read: వ్యాపారుల దోపిడి తాళలేక జామ రైతు ఈ పనిచేశాడు.. ఇప్పుడు డబుల్ ప్రాఫిట్

ఇదెక్కడి మాస్‌రా మామ..! పుష్ప సాంగ్‌పై మీమ్ చూసి పిచ్చిపిచ్చిగా నవ్విన సమంత