BJP: తెలంగాణలో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఫోకస్.. హైదరాబాద్‌లో మకాం వేసిన అగ్రనాయకత్వం

|

Nov 20, 2023 | 9:30 PM

తెలంగాణపై బీజేపీ అగ్రనాయకత్వం పూర్తిగా ఫోకస్‌ చేసింది. రానున్న వారం రోజుల పాటు తెలంగాణలో బీజేపీ అగ్రనేతలంతా పర్యటించనున్నారు. ఇప్పటికే షా, గడ్కరీ తమ ప్రచారంతో హోరెత్తిస్తుండగా ప్రధాని మోదీ మూడు రోజుల పాటు తెలంగాణలోనే మకాం వేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ, కోరుట్లలో జరిగిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రసంగించారు.

BJP: తెలంగాణలో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఫోకస్.. హైదరాబాద్‌లో మకాం వేసిన అగ్రనాయకత్వం
BJP National leaders are campaigning with the aim of winning the Telangana elections
Follow us on

తెలంగాణపై బీజేపీ అగ్రనాయకత్వం పూర్తిగా ఫోకస్‌ చేసింది. రానున్న వారం రోజుల పాటు తెలంగాణలో బీజేపీ అగ్రనేతలంతా పర్యటించనున్నారు. ఇప్పటికే షా, గడ్కరీ తమ ప్రచారంతో హోరెత్తిస్తుండగా ప్రధాని మోదీ మూడు రోజుల పాటు తెలంగాణలోనే మకాం వేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ, కోరుట్లలో జరిగిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌ కారు స్టీరింగ్‌ ఒవైసీ చేతిలో ఉందని అందుకే సెప్టెంబర్‌ 17న అధికారికంగా విమోచన దినోత్సవాలు జరపడం లేదని ఆరోపించారు షా. బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లింల రిజర్వేషన్లు తొలగించి బీసీలకు ఎస్టీలకు ఇస్తామన్నారు. తెలంగాణలో బీజేపీకి అధికారమిస్తే మూతపడిన 2 షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని షా హామీ ఇచ్చిరు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామన్న షా మాదిగ సమాజిక వర్గానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

హైదరాబాద్ ఉప్పల్‌ జరిగిన రోడ్‌షోలోనూ షా పాల్గొన్నారు. అధికారంలోకి రాగానే కేసీఆర్‌ పాలనలో జరిగిన అవినీతిపై దర్యాప్తు జరిపించి దోషులను శిక్షిస్తామన్నారు. మరోవైపు కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఎల్లారెడ్డిలో పర్యటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఇక్కడి యువత గురించి పట్టింపు లేదని కేవలం ఆయన కుటుంబ సభ్యుల గురించి మాత్రమే పట్టింపు ఉందని ఆరోపించారు గడ్కరీ. తెలంగాణ వికాసం కోసం కుటుంబ రాజకీయాలకు చెక్‌ పెట్టాలన్నారాయన. తెలంగాణలో మంగళవారం నిర్మలాసీతారామన్‌, ఫడ్నవీస్ ప్రచారం నిర్వహించనున్నారు. నెలాఖరులో తెలంగాణలో మూడు రోజుల పాటు ప్రధాని మోదీ ప్రచారం నిర్వహించనున్నారు. బీజేపీ అభ్యర్థుల తరపున జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

బీజేపీ విజయ సంకల్ప సభలో అమిత్ షా ..

ఇవి కూడా చదవండి

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..