బీజేపీ తొలి జాబితా రెడీ.. భద్రాద్రి రాముడి సన్నిధి నుంచి బీజేపీ ఎన్నికల సమరభేరి.. రంగంలోకి అమిత్ షా
Telangana BJP: తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. పోటీ చేయడానికి అభ్యర్థులను అన్ని రాజకీయ పక్షాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అమావాస్య పూర్తి కాగానే గులాబీ బాస్... అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యింది. పోటాపోటీగా అభ్యర్థుల జాబితా విడుదలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మేము సైతం ఎన్నికల అభ్యర్థుల జాబితాకు సై అంటున్నారు కమలనాథులు..

హైదరాబాద్, ఆగస్టు 14: ఎన్నికల సమరభేరి మోగించడానికి కాషాయ పార్టీ రెడీ అవుతోంది. ఈ నెల 27న ఖమ్మం జిల్లాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించబోతున్నారు. భద్రాద్రి రాముడి సన్నిధి నుంచి సమరశంఖం పూరించాలని కమలనాథులు భావిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ధీటుగాగెలుపు గుర్రాలను బరిలో దించాలని కాషాయ సేన సన్నద్ధమవుతోంది.
తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. పోటీ చేయడానికి అభ్యర్థులను అన్ని రాజకీయ పక్షాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అమావాస్య పూర్తి కాగానే గులాబీ బాస్… అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యింది. పోటాపోటీగా అభ్యర్థుల జాబితా విడుదలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మేము సైతం ఎన్నికల అభ్యర్థుల జాబితాకు సై అంటున్నారు కమలనాథులు.
ఈ నెల 27న ఖమ్మం జిల్లాలో అమిత్ షా పర్యటించబోతున్నారు. భద్రాద్రి రాముడి సన్నిధి నుంచి ఎన్నికల సమర శంఖం పూరించాలని నిర్ణయించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి ధీటుగా అభ్యర్థుల జాబితా ప్రకటనలో వెనకడుగు వేయవద్దని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే అమిత్ షా టీంలు తెలంగాణలో రహస్య సర్వేలు చేస్తున్నాయి. ఒక్కరే పోటీ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటించాలని భావిస్తున్నారు. తొలిజాబితాలో కనీసం 35 మంది అభ్యర్థులకు సీట్లను కన్ఫర్మ్ చేసే దిశగా కమలం పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు.
హిందుత్వ ఎజెండాతోనే ముందుకు వెళ్తున్న కమలం పార్టీ.. రాముడి సన్నిధి నుంచే ప్రచార పర్వాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటుంది. తెలంగాణ బీజేపీ నేతలను సమన్వయంతో పనిచేసుకోవాలని పార్టీ హైకమాండ్ నుంచి కఠినమైన ఆదేశాలిచ్చింది. పార్టీ నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా చూసుకోవాలని.. కొత్త వారి జాయినింగ్స్ పై దృష్టిపెట్టాలని పార్టీ నేతలకు హైకమాండ్ దిశానిర్ధేశం చేసింది.
రాష్ట్ర పార్టీకి అవసరమైన వనరులను సమకూర్చడానికి సిద్దంగా ఉన్నట్లు కేంద్ర నాయకత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. ఈ మేరకు కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ… పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా హైదరాబాద్ లోనే మకాం వేసి సర్ధుబాటు చర్యలు ప్రారంభించారు. ఎవరికి ఎక్కడా హామీ ఇవ్వాలో… అక్కడ ఇస్తూ లో ప్రోఫైల్ లో కిషన్ రెడ్డి పావులు కదుపుతున్నారు.
ఇతర పార్టీలో ఉన్న అసంతృప్త నేతలను కాకుండా… గెలుపు గుర్రాలనే పట్టాలని కమలం నేతలు భావిస్తున్నారు. బలహీనమైన క్యాడర్ ఉన్న నేపథ్యంలో బలమైన అభ్యర్థులు ఉంటేనే విజయం సాధ్యమవుతుందని లెక్కలు వేస్తున్నారు. మొత్తానికి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై కమల నాథుల కసరత్తులు ఏ మేరకు వర్కవుట్ అవుతారయనేది చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం