సీఆర్‌పీసీ 41ఏ నోటీసు రద్దు చేయండి.. తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్
రెండు రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు బీఎల్ సంతోష్ కి మరోసారి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. దీంతో ఈ కేసులో 41ఏ సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో బీఎల్ సంతోష్ పాటు..
తెలంగాణ హైకోర్టులో శుక్రవారంనాడు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్. నిన్ననే రెండోసారి సిట్ అధికారులు బీఎల్ సంతోష్ కి 41 ఏ సీఆర్‌సీపీ కింద నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు బీఎల్ సంతోష్ కి మరోసారి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. దీంతో ఈ కేసులో 41ఏ సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో బీఎల్ సంతోష్ పాటు తుషార్, జగ్గు స్వామిలపై కూడా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని మోమో ద్వారా హైకోర్టుకు సిట్ తెలిపింది. బిఎల్ సంతోష్ తరఫున వాదనలు వినిపిస్తున్నారు మాజీ అడ్వకేట్ జనరల్ దేశాయి ప్రకాష్ రెడ్డి.
ఈ కేసులో అరెస్టైన నిందితులు బీఎల్ సంతోష్‌తో మాట్లాడినట్టుగా సిట్ వాదిస్తుంది. ఈ కేసులో సంతోష్‌ను విచారిస్తే కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ వాదిస్తోంది. ఎమ్మెల్యేలతో నిందితులు మాట్లాడినట్టుగా బయటకు వచ్చినట్టుగా ఉన్న ఆడియోలు, వీడియోల్లో కూడా సంతోష్ పేరును కూడా ఉపయోగించారు. ఈ కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ బీజేపీ నేత బీఎల్ సంతోష్ ఇవాళ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ వాదనలు జరుగుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం