AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News Big Debate: పొత్తుల బాగోతం.. తెలంగాణలో పొలిటికల్‌ మైండ్‌గేమ్స్‌.. ఎవరు ఎవరికి ‘బీ’టీమ్..

తెలంగాణలో రాజకీయ చదరంగం రసవత్తరంగా సాగుతోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎత్తులు, పై ఎత్తుల్లో భాగంగా ప్రత్యర్ధులపై ఎవరికి వారు మైండ్‌గేమ్‌ ప్రయోగిస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీ నేతలు ఇద్దరు కలిస్తే వారి మధ్య పొత్తు పొడుస్తుందంటున్నారు.

Big News Big Debate: పొత్తుల బాగోతం.. తెలంగాణలో పొలిటికల్‌ మైండ్‌గేమ్స్‌.. ఎవరు ఎవరికి ‘బీ’టీమ్..
Big News Big Debate
Shaik Madar Saheb
|

Updated on: Feb 13, 2023 | 7:14 PM

Share

తెలంగాణలో రాజకీయ చదరంగం రసవత్తరంగా సాగుతోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎత్తులు, పై ఎత్తుల్లో భాగంగా ప్రత్యర్ధులపై ఎవరికి వారు మైండ్‌గేమ్‌ ప్రయోగిస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీ నేతలు ఇద్దరు కలిస్తే వారి మధ్య పొత్తు పొడుస్తుందంటున్నారు. బీఆర్ఎస్‌ పార్టీ బీజేపీకి బీ టీమ్ అంటూ కాంగ్రెస్‌ ఆరోపిస్తుంటే.. ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, కేసీఆర్‌ కామెంట్ల నేపథ్యంలో బీజేపీ రివర్స్‌ ఎటాక్‌ చేస్తోంది.

ఈ ఒక్కమాటతో అలర్ట్‌ అయిన బీజేపీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా యాక్షన్‌లోకి దిగింది. బీజేపీని గంటల కొద్దీ బీఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శించారు. అసెంబ్లీలో హరీష్‌రావు, కేటీఆర్‌ అయితే దాదాపు చీల్చి చెండాడారు. కేసీఆర్‌ కూడా అంతే… అయితే అందులో కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ భాగా పనిచేశారంటూ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి అస్త్రమయ్యాయి. నేతలంతా మీడియా ముందు క్యూకట్టి మరీ పొలిటికల్‌ హీట్‌ పెంచారు.

అసెంబ్లీలో బీఆర్ఎస్‌- ఎంఐఎం- కాంగ్రెస్‌ ఒకరిని ఒకరు పొడగటమే సరిపోయింది.. వీరంతా ఒకే తాను ముక్కలు అని ఇంతకాలం చెప్పింది ఇప్పుడు నిజం అయిందన్నది వారి వాదన. రెండు జాతీయ పార్టీలు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయని.. వాస్తవాలు బయటపెడితే బీజేపీ ఎందుకు ఉలిక్కిపడుతుందని కౌంటర్‌ ఇచ్చారు బీఆర్ఎస్‌ నేతలు.

ఇవి కూడా చదవండి

బీఆర్ఎస్‌- బీజేపీ మధ్య జరుగుతున్న మాటలయుద్ధంలో ఎంటరైంది కాంగ్రెస్‌ పార్టీ. నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన అన్నిబిల్లులకు మద్దతిచ్చిన బీఆర్ఎస్‌ పార్టీ బీజేపీకి బీటీమ్‌ అంటోంది. వాళ్లిద్దరి మధ్య పెద్ద డ్రామా నడుస్తుందని ఆరోపించారు పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య.

వాస్తవానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరికి వారు ప్రత్యర్ధులపై మైండ్‌గేమ్‌ ఆడుతున్నాయి. ఇటీవల అసెంబ్లీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కలవడం, MIM నేతలను కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కలవడంతో వారి పొలిటికల్‌ ఎటాక్స్‌కు ఆయుధాలు దొరికినట్టు అయింది.

బిగ్ న్యూస్ బిగ్ డిబెట్ వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..