Telangana Politics: అసెంబ్లీలో కరెంటు సెగలు.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం
Big News Big Debate: తెలంగాణ అసెంబ్లీలో కరెంటు మంటలు రాజుకున్నాయ్. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడిచింది. విద్యుత్ రంగంలో జరిగిన స్కామ్‌లపై అవసరమైతే న్యాయవిచారణ చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి.. ఇలా అసెంబ్లీలో చర్చ వాడీవేడిగా కొనసాగింది..

శాఖల వారీగా అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఇవాళ విద్యుత్ రంగంపై వైట్ పేపర్‌ను ప్రవేశపెట్టింది. అలా మొదలైన అగ్గి.. ఆసాంతం నిప్పులు చెరిగింది. ఓవైపు అధికారం పక్షం.. మరోవైపు ప్రతిపక్షం.. పరస్పరం మాటల తూటాలతో విరుచుకుపడ్డాయి.
గత ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ 24 గంటల పాటు సరఫరా చేయలేదనీ.. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టుల పేరుతో బీఆర్‌ఎస్ నేతలు ప్రజలసొమ్మును దోచుకున్నారనీ… మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో దుమారం మొదలైంది.
అయితే, కోమటిరెడ్డి వ్యాఖ్యలపై తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి. దమ్ముంటే విచారణకు ఆదేశించాలంటూ సవాల్ విసిరారు.
జగదీశ్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు సభలో ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ రంగంలో గత పదేళ్లుగా జరిగిన స్కామ్‌లపై న్యాయవిచారణ జరిపిస్తామని చెప్పారు.
ప్రధానంగా విద్యుత్ రంగంలో మూడు అంశాలపై న్యాయవిచారణ జరిపిస్తామంటున్న ప్రభుత్వ నిర్ణయంతో.. నిజాలు నిగ్గుతేలుతాయా? అసలు తప్పు చేసిందెవరు? జైలుకు వెళ్లేదెవరు? అన్నదే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.
బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..