Telangana Politics: రాజకీయ వరి సాగు.. బోనస్‌పై కాంగ్రెస్ మాట మార్చిందా? కొనుగోళ్లలో U ట్యాక్స్‌ నిజమేనా?

|

May 21, 2024 | 9:59 PM

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన మరో గ్యారెంటీపై రాజకీయ రచ్చ మొదలైంది. సన్నాలు పండించిన ధాన్యం రైతులకే బోనస్‌ ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. మరోవైపు కొనుగోళ్ల విషయంలోనూ అక్రమాలు జరుగుతున్నాయని యూ ట్యాక్స్‌ పేరుతో వందల కోట్లు చేతులు మారుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ నాయకులు.

Telangana Politics: రాజకీయ వరి సాగు.. బోనస్‌పై కాంగ్రెస్ మాట మార్చిందా? కొనుగోళ్లలో U ట్యాక్స్‌ నిజమేనా?
Telangana Politics
Follow us on

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన మరో గ్యారెంటీపై రాజకీయ రచ్చ మొదలైంది. సన్నాలు పండించిన ధాన్యం రైతులకే బోనస్‌ ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. మరోవైపు కొనుగోళ్ల విషయంలోనూ అక్రమాలు జరుగుతున్నాయని యూ ట్యాక్స్‌ పేరుతో వందల కోట్లు చేతులు మారుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ నాయకులు.

ఆరు గ్యారెంటీల్లో భాగంగా ధాన్యం రైతులకు బోనస్‌ పథకాన్ని ప్రకటించింది ప్రభుత్వం. వచ్చే సీజన్‌ నుంచి అమలు చేయాలని కేబినెట్‌లో తీర్మానం చేశారు. అయితే సన్నబియ్యం పండించే రైతులకే ఇవ్వాలన్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది.

బోనస్ కాదు ఇదంతా పెద్ద బోగస్‌ అంటోంది బీఆర్ఎస్‌ పార్టీ. రాష్ట్రంలో రైతులు కేవలం తమ అవసరాలకు మాత్రమే సన్నబియ్యం పండిస్తారని.. ఆదాయం కోసం దొడ్డు బియ్యం సాగు చేస్తారని గుర్తు చేస్తోంది. 90శాతం రైతులకు అన్యాయం చేయడమేనంటున్నారు మాజీమంత్రులు. ఓట్లు పడగానే సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చాడని కేవలం సన్నరకానికే 500 బోనస్ ఇస్తాననడం మోసపూరిత చర్య అంటోంది ప్రతిపక్షం.

మరోవైపు ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరుతో 10శాతం వరకూ తీసేసి దోచుకుంటున్నారని ఆరోపించింది బీజేపీ. కొత్తగా రాష్ట్రంలో U ట్యాక్స్‌ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని వందల కోట్లు చేతులుమారుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి.

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో చూడండి..

ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని కౌంటర్‌ ఇచ్చారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. వరి కొనుగోళ్ల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సన్న బియ్యానికే బోనస్ అనలేదని.. సన్నాలతో 500 రూపాయల బోనస్‌ ప్రక్రియను మొదలు పెట్టామన్నారు మంత్రి. ఒకప్పుడు వరి వేస్తే ఉరే అన్నవాళ్లు విమర్శలు చేయడం ఏంటని నిలదీశారు.

అటు ధాన్యానికి బోనస్‌పై రచ్చ.. ఇటు అవినీతి ఆరోపణలతో తెలంగాణ రాజకీయాలు మరొక్కసారి హీటెక్కాయి.