భద్రాద్రి ఆలయంలో లైవ్ పెయింటింగ్.. యువతి టాలెంట్‌కు ఫిదా అవ్వాల్సిందే..!

ఇప్పటికే స్వర్ణగిరి ఆలయంలో లైవ్ పెయింటింగ్ చిత్రీకరణ చేశానని, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు తనవంతుగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న అన్ని ఆలయాలను లైవ్ పెయింటింగ్స్ వేసి ఆ దేవస్థానాలకు అందజేయాలన్న కార్యక్రమం వంద రోజుల్లో పూర్తి చేయాలన్నదే తన లక్ష్యమని లావణ్య అంటున్నారు.

భద్రాద్రి ఆలయంలో లైవ్ పెయింటింగ్.. యువతి టాలెంట్‌కు ఫిదా అవ్వాల్సిందే..!
Painted Live By Lavanya

Edited By: Jyothi Gadda

Updated on: Jul 16, 2024 | 8:40 PM

చిన్ననాటి నుండి చిత్రలేఖనంపై  తనకున్న మక్కువతో తానంతటతానే ఆ కళను నేర్చేసుకుంది. అంచలంచలుగా  చిత్రలేఖనంలో ఎదుగుతుంది. తన చేతుల్లో ఏదో మాయాజాలం దాగివుందన్నట్టుగా కనిపించిన ప్రతి అందానికి తన చేతుల ద్వారా ప్రాణం పోసినట్టుగా తీర్చిదిద్దుతోంది.  యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన నామోజు లావణ్య బీకాం పూర్తి చేసిన లావణ్య చిత్రలేఖనాన్నే తన వృత్తిగా మలుచుకుంటుంది. ఇప్పటికే కొలతలు లేకుండా ఫ్రీ హ్యాండ్ చిత్రాలు గీయడంలో తనదైన శైలిలో రాణిస్తున్నారు.

నామోజు ఆయిల్ పెయింట్స్ తో పాటు యాక్రిలిక్ మిక్స్ ను కాన్వాస్ పై రకరకాల రంగులతో చిత్రాలను అద్భుతంగా తీర్చి దిద్దుతున్నారు. గుట్టలపై ఉన్న రాళ్లకు జీవం పోస్తూ, అటవీ జంతువుల బొమ్మలను గీస్తూ జూ పార్కును తలపించేలా రాక్ స్టోన్స్ పై పెయింటింగ్ వేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం రామాలయాన్ని లైవ్ పెయింటింగ్ వేయాలన్న తన ఆలోచనను ఆచరణలో పెట్టి రామాలయ చిత్రాన్ని పెయింటింగ్ పూర్తిచేసి ఆలయ ఈవో రమాదేవికి అందజేశారు.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే స్వర్ణగిరి ఆలయంలో లైవ్ పెయింటింగ్ చిత్రీకరణ చేశానని, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు తనవంతుగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న అన్ని ఆలయాలను లైవ్ పెయింటింగ్స్ వేసి ఆ దేవస్థానాలకు అందజేయాలన్న కార్యక్రమం వంద రోజుల్లో పూర్తి చేయాలన్నదే తన లక్ష్యమని లావణ్య అంటున్నారు. భవిష్యత్ లో పురాణ ఆలయాల చిత్రాలను వేయడమే తన ఆకాంక్ష అని ఆమె తెలిపారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..