Kishan Reddy: దేశం అండగా నిలుస్తోంది.. అమర జవాన్లకు నివాళులర్పించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..

జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు జవాన్లు వీరమరణం చెందారు. దోడా జిల్లాలోని డెస్సాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారిలో ఒక ఆర్మీ ఆఫీసర్‌, నలుగురు సైనికులు ఉన్నారు. వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం సంతాపం తెలిపింది. అమర జవాన్లకు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి నివాళులర్పించారు.

Kishan Reddy: దేశం అండగా నిలుస్తోంది.. అమర జవాన్లకు నివాళులర్పించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..
Union Minister Kishan Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 16, 2024 | 7:39 PM

జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు జవాన్లు వీరమరణం చెందారు. దోడా జిల్లాలోని డెస్సాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారిలో ఒక ఆర్మీ ఆఫీసర్‌, నలుగురు సైనికులు ఉన్నారు. వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం సంతాపం తెలిపింది. అమర జవాన్లకు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు దేశం అండగా నిలుస్తోందన్నారు.

‘‘ఈరోజు జమ్మూలోని ఉర్రర్ బగ్గి, దోడాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో తమ ప్రాణాలను అర్పించిన ధైర్యవంతులైన భారత ఆర్మీ సైనికులకు నివాళులు అర్పించాను.. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన మన సైనికుల కుటుంబాలకు దేశం అండగా నిలుస్తోంది.’’ అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.

వీడియో చూడండి..

జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సైనికుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేసారు. ఉగ్రవాదంపై పోరులో ప్రజలు ఏకం కావాలని కోరారు. సైనికుల మరణాలకు ప్రతీకారం తప్పదని హెచ్చరించారు.

భారత సైన్యం అధికారిక ట్విట్టర్‌ పేజీలో సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన కెప్టెన్ బ్రిజేష్ థాపా, నాయక్ డి రాజేష్, సిపాయి బిజేంద్ర, సిపాయి అజయ్‌లకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. మృతుల కుటుంబాలకు ఇండియన్ ఆర్మీ అండగా నిలుస్తుందని తెలిపింది.

సోమవారం సాయంత్రం ఉగ్రవాదుల నక్కిఉన్నారన్న సమాచారంతో గాలింపు చర్యలు చేపడుతుండగా సైనికులపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దోడా జిల్లాలోని దేసా అనే ప్రాంతంలో అర్థరాత్రి తర్వాత ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే ఇంటెలిజెన్స్‌ సమాచారంతో ఆర్మీ, జమ్ముకశ్మీర్‌ పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ ఆపరేషన్‌ కొనసాగుతుండగా, ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు జవాన్లు చనిపోయారు. ప్రస్తుతం టెర్రరిస్ట్‌ల ఏరివేతకు ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు. ఉగ్రవాదుల ఏరివేత కోసం అక్కడ సెర్చింగ్‌ ఆపరేషన్‌ను ముమ్మరం చేశారు. సోమవారం రాత్రి ప్రారంభమైన ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..