AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బాబోయ్ కోతులు.. పంట పొలాలు కాపాడుకునేందుకు ఈ రైతు ఏం చేశాడో చూడండి! వీడియో

కోతుల బెడద రైతులకు తప్పడం లేదు. ఎక్కడ చూసినా కోతులు.. అడవిలో ఉండాల్సిన కోతులు.. జనావాసాలు, రోడ్లు, పంట పొలాల్లో తిరుగుతూ ఇబ్బందులు పెడుతున్నాయి. రైతులకు అయితే పంట పొలాలను నాశనం చేస్తూ కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఏమి చేసినా వీటి బెడద తప్పడం లేదు. 'హేయ్ కోతుల్లారా ఇక్కడ అడుగుపెట్టి చూడండి. అదిరిద్ది మీకు..' అని కొండ ముచ్చుల ప్లెక్సీలతో ఏర్పాటు చేసిన ఈ రైతు ఆలోచన అందరికీ..

Telangana: బాబోయ్ కోతులు.. పంట పొలాలు కాపాడుకునేందుకు ఈ రైతు ఏం చేశాడో చూడండి! వీడియో
Baboons Flexi In Crop Field
N Narayana Rao
| Edited By: Srilakshmi C|

Updated on: Jan 29, 2024 | 8:53 AM

Share

భద్రాచలం, జనవరి 29: కోతుల బెడద రైతులకు తప్పడం లేదు. ఎక్కడ చూసినా కోతులు.. అడవిలో ఉండాల్సిన కోతులు.. జనావాసాలు, రోడ్లు, పంట పొలాల్లో తిరుగుతూ ఇబ్బందులు పెడుతున్నాయి. రైతులకు అయితే పంట పొలాలను నాశనం చేస్తూ కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఏమి చేసినా వీటి బెడద తప్పడం లేదు. ‘హేయ్ కోతుల్లారా ఇక్కడ అడుగుపెట్టి చూడండి. అదిరిద్ది మీకు..’ అని కొండ ముచ్చుల ప్లెక్సీలతో ఏర్పాటు చేసిన ఈ రైతు ఆలోచన అందరికీ ఆదర్శంగా నిలిచింది. కోతులు దండయాత్ర చేయడంతో వాటికి చెక్ పెట్టేందుకు జీవంలేని కొండముచ్చుల ఫ్లెక్సీలను రంగంలోకి దింపారు భద్రాచలం ఏజెన్సీ రైతులు. పల్లెలు-పట్టణాలు తేడా లేకుండా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో కూరగాయల తోటలు పెంచే రైతులు కోతులతో నానా ఇబ్బందులు పడుతున్నారు. కోతుల దాడులను నియంత్రించేందుకు ప్రయత్నిస్తే ఎదురుదాడికి దిగుతున్నాయి. కోతుల దాడులలో గాయపడటంతో పాటు పంట నష్టం కూడా తప్పడం లేదు. కోతుల బాధ ఎక్కువగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో కొండముచ్చుల ఫ్లెక్సీలను పంటలకు రక్షణగా వాడుతున్నారు.

గ్రామానికి వచ్చిన కోతుల గుంపులను తరిమితే దగ్గరలోని కూరగాయల తోటలపై పడి తినడం కన్నా పాడు చేయడమే ఎక్కువగా ఉంది. ఇళ్లకు వచ్చిన కోతులను కొడితే పంట పొలాలకు పోతాయి. పంట పొలాలకు వచ్చిన కోతులను కొడితే ఇంకో చోటికి పోతాయి. అవి ఎక్కడికి పోయినా ఇంటికైనా.. పొలాలకైనా.. కావలి కాయాల్సిందే మేము. చివరికి మాకు ప్రశాంతత లేకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతుల దండయాత్ర తిప్పికొట్టేందుకు కొండముచ్చుల ఫ్లెక్సీల ఏర్పాటే కాదు. నిత్యం ఉదయం సాయంత్రం వేళల్లో టపాసులు కూడా పేల్చి కోతుల బెడద నుంచి తప్పించుకొని పంట దిగుబడిని పెంచుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.