AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress – BRS: బరాబర్ కలుస్తా.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్.. ఏమన్నారో తెలుసా..?

BRS MLA Prakash Goud Meets CM Revanth Reddy: 64 మంది ఎమ్మెల్యేల సంపూర్ణ మెజార్టీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఐదేళ్లు తమకు ఢోకా లేదని కాంగ్రెస్ ధీమాగా ఉంటే.. వీలైనంత త్వరలోనే అధికారాన్ని చేజిక్కించుకుంటామంటోంది బీఆర్‌ఎస్. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గర నుంచి గల్లీ లీడర్ వరకు అందరిలోనూ ఇదే కాన్ఫిడెంట్ కనిపిస్తోంది.

Congress - BRS: బరాబర్ కలుస్తా.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్.. ఏమన్నారో తెలుసా..?
Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Jan 29, 2024 | 9:50 AM

Share

BRS MLA Prakash Goud Meets CM Revanth Reddy: 64 మంది ఎమ్మెల్యేల సంపూర్ణ మెజార్టీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఐదేళ్లు తమకు ఢోకా లేదని కాంగ్రెస్ ధీమాగా ఉంటే.. వీలైనంత త్వరలోనే అధికారాన్ని చేజిక్కించుకుంటామంటోంది బీఆర్‌ఎస్. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గర నుంచి గల్లీ లీడర్ వరకు అందరిలోనూ ఇదే కాన్ఫిడెంట్ కనిపిస్తోంది. ఇది కేవలం స్పీడ్‌బ్రేకర్ మాత్రమే.. వంద స్పీడ్‌తో కారు దూసుకువస్తుందన్నారు కేటీఆర్. తొందరలోనే కేసీఆర్‌ని మళ్లీ సీఎం చేసుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. అయితే తాము తలుచుకుంటే బీఆర్‌ఎస్‌ను 100 మీటర్ల లోతులో పాతిపెడతామని హెచ్చరిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రజా తీర్పును గౌరవించి ప్రతిపక్షపాత్ర పోషిస్తే ఓకే.. అలా కాదని ఏవైనా కుట్రలు, కుయుక్తులు పన్నితే.. బీఆర్‌ఎస్‌ని ముక్కలు ముక్కలుగా చేస్తామంటోంది అధికారపక్షం.

సీఎం రేవంత్‌రెడ్డిని వరుసబెట్టి కలుస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..

కారు పార్టీలో కాన్ఫిడెంట్ అయితే దండిగా ఉంది కానీ.. జరుగుతున్న పరిణామాలు మాత్రం మరోలా ఉన్నాయి. సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వరుసబెట్టి కలుస్తున్నారు. మొన్నటికి మొన్న సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, మాణిక్‌ రావు, మహిపాల్ రెడ్డి.. సీఎంకు పుష్పగుచ్ఛం ఇచ్చి ఫోటోలు దిగారు. వాళ్లు నలుగురూ పార్టీ మారుతారని ప్రచారం జరిగినా.. మర్యాదపూర్వక భేటీ అంటూ కొట్టిపారేశారు. ఆ తర్వాత మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి.. లేటెస్ట్‌గా ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌.. సీఎంతో కరచాలనం చేయడం తెలంగాణ గట్టుపై రాజకీయ హీట్ పెంచింది. ఇదే సమయంలో తమకు చాలామంది నేతలు టచ్‌లో ఉన్నారని మధుయాష్కీ చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.

అయితే, ప్రకాశ్ గౌడ్ ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌‌‌‌లోని రేవంత్ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ ప్రకాశ్​గౌడ్​కు కండువా కప్పి స్వాగతం పలకడంతో ఆయన కాంగ్రెస్‌‌‌‌లోకి వెళ్తున్నారంటూ వార్త చక్కర్లు కొట్టింది. అయితే ఆ వార్తలను ప్రకాశ్‌‌‌‌గౌడ్ ఖండించారు. మర్యాదపూర్వకంగానే సీఎంను తాను కలిశానని, అవసరమైతే.. వంద సార్లు కలుస్తానని అన్నారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి మాత్రమే రేవంత్ రెడ్డిని కలిశానని.. అందులో తప్పేముందంటూ ప్రశ్నించారు.

మొత్తంగా అధికార విపక్షాల మధ్య జరుగుతున్న పరిణామాలు.. పేలుతున్న డైలాగులతో తెలంగాణ రాజకీయాలు నెక్ట్స్ లెవెల్‌కి వెళ్లాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..