AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Mandir: రామయ్యని వదలని సైబర్ నేరగాళ్లు.. ఈ పేరుతో వాట్సాప్​లో మెసేజ్ వస్తే బీ అలెర్ట్..

ఈ నెల 22వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా రామమందిరం ప్రారంభం కానుంది. దీంతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరతీశారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి వీఐపీ టిక్కెట్ల పేరుతో వాట్సాప్‌కు ఏపీకే ఫైల్‌ను పంపిస్తున్నారు. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే... దీనిపై క్లిక్ చేస్తే మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు తస్కరణకు గురయ్యే అవకాశముంది.

Ram Mandir: రామయ్యని వదలని సైబర్ నేరగాళ్లు.. ఈ పేరుతో వాట్సాప్​లో మెసేజ్ వస్తే బీ అలెర్ట్..
Ram Mandir Inauguration
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Jan 13, 2024 | 7:53 PM

Share

సైబర్ నేరగాళ్లు ప్రజల నుంచి డబ్బులు కొట్టేయడానికి ఏ అవకాశాన్నీ వదులుకోరు. ప్రజలకు ఆసక్తిని కలిగించే ఏ అంశం అయినా దోచుకోవడానికి మార్గంగా ఎంచుకుంటారు. గత కొన్నిరోజులుగా దేశంలో రామమందిరం ప్రాణప్రతిష్ఠపై చర్చ సాగుతోంది. కోట్లాదిమంది హిందువులు రామాలయ ప్రారంభోత్సవం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సైబర్ నేరగాళ్ళు చివరకు రామమందిర ప్రారంభోత్సవ ఈవెంట్‌ను కూడా వదలలేదు. ఈ నెల 22వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా రామమందిరం ప్రారంభం కానుంది.

దీంతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరతీశారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి వీఐపీ టిక్కెట్ల పేరుతో వాట్సాప్‌కు ఏపీకే ఫైల్‌ను పంపిస్తున్నారు. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే… దీనిపై క్లిక్ చేస్తే మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు తస్కరణకు గురయ్యే అవకాశముంది. దీనికి సంబంధించి టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

“‘అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఈవెంట్కు వీఐపీ టికెట్లు కావాలా? అయితే ఈ లింక్ క్లిక్ చేయండి. డైరెక్ట్గా ఈ ఏపీకే ఫైల్‌ను డౌన్లోడ్ చేసుకోండి.’ అని మీకు వాట్సాప్లో మెసేజ్ వచ్చిందా? అయితే తస్మాత్ జాగ్రత్త! ఇలాంటి మెసేజ్లోని లింక్స్ క్లిక్ చేసినా, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసినా.. ఇక అంతే! మీ డేటాను సైబర్ నేరగాళ్లు దోచుకుంటారు. మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ వివరాలన్నీ తస్కరించి మోసాలకు తెగబడుతారు.” అంటూ సజ్జనార్ హెచ్చరిక ట్వీట్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం
ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం
ప్రయత్నం చిన్నదే అయినా ఫలితం గొప్పగా ఉంటుంది.. తెలివైన కాకి కథ
ప్రయత్నం చిన్నదే అయినా ఫలితం గొప్పగా ఉంటుంది.. తెలివైన కాకి కథ
రూ.10,000 SIPతో రూ.28.89 లక్షల రిటర్న్స్.. ధనవంతులను చేసిన ఫండ్!
రూ.10,000 SIPతో రూ.28.89 లక్షల రిటర్న్స్.. ధనవంతులను చేసిన ఫండ్!
మనీ ప్లాంటే కాదు..ఈ మొక్క ఇంటిలో ఉన్నా ఆస్తి పాస్తులు పెరగడం ఖాయం
మనీ ప్లాంటే కాదు..ఈ మొక్క ఇంటిలో ఉన్నా ఆస్తి పాస్తులు పెరగడం ఖాయం
టీ20 కెరీర్‌లోనే స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ.. కట్‌చేస్తే..
టీ20 కెరీర్‌లోనే స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ.. కట్‌చేస్తే..
జస్ట్ ఫేస్ స్కాన్‌తో గూగుల్ అకౌంట్ అన్‌లాక్.. ఎలా పనిచేస్తుంది?
జస్ట్ ఫేస్ స్కాన్‌తో గూగుల్ అకౌంట్ అన్‌లాక్.. ఎలా పనిచేస్తుంది?
పేపర్‌ లీక్‌ వ్యవహారంపై ప్రధాని మోదీ సంచలన నిర్ణయం
పేపర్‌ లీక్‌ వ్యవహారంపై ప్రధాని మోదీ సంచలన నిర్ణయం
మామూలుగా ఉండదు మరి.. మంత్రితో చిన్నారుల ముచ్చట..
మామూలుగా ఉండదు మరి.. మంత్రితో చిన్నారుల ముచ్చట..
బిగ్‌బాస్ కప్పుతోనే బయటకు రావాలి.. నన్ను తీసుకోండి నాగ్ సార్
బిగ్‌బాస్ కప్పుతోనే బయటకు రావాలి.. నన్ను తీసుకోండి నాగ్ సార్