Double Bedroom Houses: ‘ఇంకా ఎన్నాళ్లు ఆగాలి’.. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఆక్రమించుకున్న లబ్ధిదారులు

జగిత్యాల జిల్లాలో ఆసక్తికర ఇన్సిడెంట్ జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలంటూ లబ్దిదారులు అధికారులపై ఫైరయ్యారు. అంతేకాదు....

Double Bedroom Houses: 'ఇంకా ఎన్నాళ్లు ఆగాలి'.. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఆక్రమించుకున్న లబ్ధిదారులు
Double Bedroom

జగిత్యాల జిల్లాలో హైటెన్షన్ నెలకుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలంటూ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. అంతటితో సరిపెట్టలేదు. ఏకంగా  తాళాలు పగులగొట్టి ఇళ్లను ఆక్రమించుకున్నారు. ఎటువంటి ప్రారంభోత్సవం లేకుండానే మల్యాల మండలం నూకపల్లిలోని 19 డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో లబ్దిదారులు గృహప్రవేశం చేశారు. పోయిన దసరాకే ఇళ్లిస్తామని చెప్పి.. నెలల తరబడి జాప్యం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తాము గుడిసెల్లో బ్రతుకుతున్నామని.. విషపురుగులతో జీవించలేకపోతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక గృహప్రవేశం చేసిన డబుల్ బెడ్రూం ఇళ్ల నుంచి ఖాళీ చేసే ప్రసక్తి లేదని చెబుతున్నారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. మరి ఈ ఘటనపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

పత్రాల్లో డబుల్‌ బెడ్ రూమ్‌ ఇళ్లు.. రూ.లక్షల్లో వసూళ్లు

 ఇక డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించిన భారీ మోసం హైదరాబాద్‌లో వెలుగుచూసింది. పేదల సొంతింటి కలను వారు టార్గెట్ చేశారు. ప్రభుత్వం ఫ్రీగా మంజూరు చేసే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామంటూ హైదరాబాద్‌లో పలువురు అమాయకుల నుంచి రూ.లక్షల్లో కాజేశారు. చివరికి బాధితుల ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను బాలానగర్‌ జోన్‌ డీసీపీ పద్మజ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. బొమ్మిడాం కుమార్‌, షేక్‌ సల్మాన్‌లు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇప్పిస్తామని బోరబండ, కూకట్‌పల్లి, మియాపూర్‌ ఏరియాల్లో  పలువురి వద్ద భారీగా డబ్బులు వసూలు చేశారు. ఇళ్లు కేటాయించినట్టు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఒక్కో బాధితుడి నుంచి రూ. 1.50 లక్షల నుంచి రూ. 6.50 లక్షల వరకు వసూలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రధాన నిందితుడు కుమార్‌.. పేరు మార్చుకుని ఫేక్ ఐడీ కార్డుతో హౌసింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో అధికారినని నమ్మించాడు. వీరి బారినపడి ఇప్పటివరకు 100 మంది వరకు మోసపోయి ఉంటారని బాలానగర్‌ డీసీపీ తెలిపారు.

Also Read: గంటా తులసి.. స్కెచ్‌ వేస్తే ఖేల్ ఖతమే.. ఆటో ప్రయాణికులే టార్గెట్.. ఇప్పటికే 20 కేసులు

పారాలింపిక్స్‌లో అవని లేఖరా సంచలన ప్రదర్శన.. ఇప్పటికే ఖాతాలో రెండు మెడల్స్.. మరొకటి

Click on your DTH Provider to Add TV9 Telugu