Bathukamma Saree: తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుక.. నేటి నుంచే చీరల పంపిణీ..

|

Sep 22, 2022 | 8:04 AM

Bathukamma Saree: తెలంగాణలో ఆడపడుచులకు బతుకమ్మ కానుక అందిస్తోంది ప్రభుత్వం. నేటి(గురువారం) నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ చేయనుంది.

Bathukamma Saree: తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుక.. నేటి నుంచే చీరల పంపిణీ..
Bathukamma Saree
Follow us on

Bathukamma Saree: తెలంగాణలో ఆడపడుచులకు బతుకమ్మ కానుక అందిస్తోంది ప్రభుత్వం. నేటి(గురువారం) నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ చేయనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు సిరిసిల్ల కలెక్టరేట్‌ హాల్‌లో బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు మంత్రి కేటీఆర్‌. ఈ ఏడాది బతుకమ్మ చీరల ప్రాజెక్ట్ కోసం రూ.339 కోట్లలకు పైగా ఖర్చు చేశామని, అన్ని జిల్లాల్లో మొత్తం కోటి చీరలు పంచుతున్నట్టు తెలిపారు మంత్రి కేటీఆర్. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని..ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ చేనేత శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా ఏటా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. 2017 నుంచి ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా తెల్లరేషన్‌ కార్డు లబ్ధిదారులై, 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు బతుకమ్మ చీరను అందిస్తోంది. ధనిక, పేద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలనే సంకల్పంతో.. సీఎం కేసీఆర్‌ ప్రతి ఆడపడుచుకు బతుకమ్మ చీరలను సారెగా పంపిణీ చేస్తున్నారు. పండుగకు కొత్త చీరలు అందడంతో మహిళలు మురిసిపోతున్నారని అంటున్నారు గులాబీ శ్రేణులు. కాగా, ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్న ప్రభుత్వం.. 24 రకాల డిజైన్లు, 10 రకాల రంగులలో చీరలు అందిస్తోంది. ఈ కార్యక్రమం ప్రారంభించిన 2017 నుంచి నేటి వరకు(ఈ ఏడాది చీరలతో కలుపుకొని) 5.81 కోట్ల చీరలను తెలంగాణ ఆడబిడ్డలకు అందించినట్టవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..