Telangana: తెలంగాణ ఆడపచులకు గుడ్ న్యూస్.. కోటి బతుకమ్మ చీరల పంపిణీకి ముహూర్తం ఫిక్స్

బల్దియా పరిధిలో గత సంవత్సరం 9 లక్షల 59 వేల 660  చీరలు పంపిణీ చేసినట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. ఈసారి ఈ సంఖ్య భారీగా పెరిగింది.

Telangana: తెలంగాణ ఆడపచులకు గుడ్ న్యూస్.. కోటి బతుకమ్మ చీరల పంపిణీకి ముహూర్తం ఫిక్స్
Bathukamma Sarees
Follow us

|

Updated on: Sep 21, 2022 | 5:16 PM

Bathukamma sarees : తెలంగాణ సర్కార్ దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్రంలోని మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. గురువారం నుంచే బతుకమ్మ చీరల పంపీణి  చేయబోతున్నట్లు మంత్రి కేటీఆర్(KTR) తెలిపారు. కాగా ఈసారి కోటి బతుకమ్మ చీరలు పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ఈ సంవత్సరం 24 విభిన్న డిజైన్లు, 10 రకాల ఆకర్షణీయమైన రంగులలో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్ (దారపు పోగుల అంచుల) చీరలను పంచనున్నారు.  92 లక్షల రెగ్యులర్ చీరలకు అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో వయోవృద్ధ మహిళలు ధరించే 9.00 మీటర్లు పొడవు గల మరో 8 లక్షల చీరలు సిద్ధం చేశారు. ఈ బతుకమ్మ చీరల ప్రాజెక్టు కొరకు మొత్తం రూ. 339.73 కోట్ల ఖర్చు చేయనుంది ప్రభుత్వం. బతుకమ్మ చీరల కార్యక్రమంతో నేతన్న జీవితాల్లో వెలుగులు నిండాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఈసారి కోటి మంది తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుక ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. సెప్టెంబర్ 22 నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపీణీ ఉంటుందని చెప్పారు.

GHMC పరిధిలో 15.85 లక్షల బతుకమ్మ చీరల పంపిణీకి సిద్దం – మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

బతుకమ్మ చీరల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు  మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. GHMC పరిధిలో మొత్తం 30 సర్కిళ్ల తో పాటు కంటోన్మెంట్ ఏరియాలో కూడా బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ కోసం ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా తీరొక్క రంగుల్లో బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్నారు. సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ తదితర ప్రాంతాల్లోని నేతన్నలతో చేయించిన 240 రకాల వివిధ వెరైటీ  డిజైన్‌లతో చీరలు తయారు చేయించినట్లు వివరించారు. ఈనెల 25వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు జరుగు బతుకమ్మ పండుగను పురస్కరించుకొని  బీదవారు కూడా ఆనందోత్సవాలతో బతుకమ్మ పండుగను జరుపుకోవాలనేదే ప్రభుత్వ సంకల్పం అని మేయర్ తెలిపారు. ఈ నేపథ్యంలో GHMC పరిధిలో మొత్తం 30 సర్కిళ్ల లోని 150 వార్డులలో స్థానిక ప్రజా ప్రతినిధులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా మంత్రులు చీరలను పంపిణీ చేయనున్నారు. GHMCలో మొత్తం 15 లక్షల 85 వేల 405  చీరలు అవసరం ఉంటాయని అంచనా వేశారు. బల్దియా పరిధిలో  గత సంవత్సరంలో 9 లక్షల 59 వేల 660  చీరలు పంపిణీ చేసినట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్