Bandi Sanjay: సీఎం కాలేననే బాధతోనే రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ రాజకీయాలను రూ.25 కోట్ల వ్యవహారం షేక్ చేస్తోంది. ఈటల రాజేందర్ చేసిన రూ.25 కోట్ల ఆరోపణలు.. కాంగ్రెస్.. బీజేపీ మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్.. కాంగ్రెస్ కు రూ.25 కోట్లు ఇచ్చిందన్న ఆరోపణలతో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం సైతం చేశారు. నిరూపించాలంటూ ఈటల రాజేందర్ కు సవాల్ చేశారు.

తెలంగాణ రాజకీయాలను రూ.25 కోట్ల వ్యవహారం షేక్ చేస్తోంది. ఈటల రాజేందర్ చేసిన రూ.25 కోట్ల ఆరోపణలు.. కాంగ్రెస్.. బీజేపీ మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్.. కాంగ్రెస్ కు రూ.25 కోట్లు ఇచ్చిందన్న ఆరోపణలతో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం సైతం చేశారు. నిరూపించాలంటూ ఈటల రాజేందర్ కు సవాల్ చేశారు. ఈ క్రమంలో భావోద్వేగానికి సైతం లోనయ్యారు. అయితే, మునుగోడు క్యాష్ ఎపిసోడ్‌లోకి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా ఎంట్రీ ఇచ్చారు. BRS నుంచి కాంగ్రెస్ 25 కోట్లు తీసుకుందన్న ఈటల రాజేందర్ ఆరోపణలను సమర్ధించారు సంజయ్. కాంగ్రెస్ పార్టీ ఆ మొత్తాన్ని తీసుకుందని ఈటల అన్నారు తప్పితే.. రేవంత్‌రెడ్డే ఆ అమౌంట్ తీసుకున్నారని ఎక్కడా చెప్పలేదన్నారు సంజయ్. కాంగ్రెస్ పూర్తిగా BRS చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు బండి సంజయ్. పదవి పోతుందనే బాధలోనే రేవంత్ కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు బండి.
సీఎం కాలేననే బాధతోనే రేవంత్ కన్నీళ్లు పెట్టుకున్నారని.. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఖాయమని తెలిసి పీసీసీ పదవి నుండి తప్పిస్తారనే బాధతోనే కన్నీళ్లు పెట్టుకున్నారేమోనంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ రూ.25 కోట్లు ముట్టజెప్పారని ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి బాధపడి ఏడవటంలో తప్పులేదని చెప్పారు.
‘‘రేవంత్ ఏడుపు నిజమే. బాధ ఉంటేనే ఏడుపొస్తది. కానీ దేని కోసం బాధపడ్డారో తెలుసా? రేవంత్ రెడ్డి సీఎం కావాలనుకున్నరు. కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బీఆర్ఎస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ బాధతోపాటు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న తనను మారుస్తారనే బాధ కూడా తోడై వచ్చిన నీళ్లే రేవంత్ కు కన్నీళ్లుగా మారాయి.’’ అని వ్యాఖ్యానించారు. మహాత్మా బసవేశ్వరుడి జయంతిని పురస్కరించుకుని ఈరోజు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ తో కలిసి ట్యాంక్ బండ్ వద్దనున్న బసవేశ్వరుడి విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం ఈటల రాజేందర్ తో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
