AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warangal: పట్టపగలు నడిరోడ్డుపై కత్తుల కోలాటం.. ప్రాణాలు కోల్పోయిన ఆటో డ్రైవర్

హనుమకొండ జిల్లాలో దుండగుడు రెచ్చిపోయాడు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై ఆటో డ్రైవర్‌ను అడ్డగించిన మరో ఆటో డ్రైవర్ కత్తితో అత్యంత పాశవికంగా హతమార్చాడు. అనంతరం స్థానికులను కత్తులతో బెదిరిస్తూ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Warangal: పట్టపగలు నడిరోడ్డుపై కత్తుల కోలాటం.. ప్రాణాలు కోల్పోయిన ఆటో డ్రైవర్
Warangal Crime
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jan 22, 2025 | 3:13 PM

Share

హనుమకొండలో దారుణం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో.. ప్రధాన రహదారిపై కత్తులు కోలాటం చేశాయి. ఓ ఆటో డ్రైవర్‌ను అందరు చూస్తుండగానే పట్టపగలే మరో ఆటో డ్రైవర్ కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హతమార్చాడు.. అంతా చూస్తుండగానే హతమార్చి అక్కడి నుండి పారిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ హత్య హన్మకొండలోని అదాలత్ సెంటర్‌లో జరిగింది. హైదరాబాద్ – హనుమకొండ ప్రధాన రహదారిపై ఆటో డ్రైవర్‌ను ఆపిన మరో ఆటో డ్రైవర్ కత్తితో పొడిచి హతమార్చాడు. అంతా చూస్తుండగానే విచక్షణారహితంగా కత్తితో ఛాతీలో పొడిచి హతమార్చాడు.. కత్తిపోట్లతో గాయపడ్డ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదంతా జరుగుతున్న అక్కడున్న స్థానికులు ఎవరు ముందుకు వచ్చి ఆపేంత ధైర్యం చేయలేకపోయారు. హత్య అనంతరం అదే కత్తితో అందరిని బెదిరిస్తూ.. దుండగుడు అక్కడి నుండి పారిపోయాడు.

ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు మడికొండ ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ అనే ఆటోడ్రైవర్ గా గుర్తించారు. డెడ్ బాడీని ఎంజీఎం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఆర్థిక లావాదేవీలు ఇంతటి దారుణానికి కారణమా..? మరేదైనా కారణం ఉందా..? అనే కోరడంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కత్తితో పొడిచి పారిపోయిన నిందితుడి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

క్రికెట్‎లో పాలిటిక్స్..కొత్త డ్రామాకు తెరలేపిన బంగ్లా బోర్డు
క్రికెట్‎లో పాలిటిక్స్..కొత్త డ్రామాకు తెరలేపిన బంగ్లా బోర్డు
వెంకీ, రవితేజ, నాగార్జునతో బ్లాక్ బస్టర్స్.. కానీ ఇప్పుడు
వెంకీ, రవితేజ, నాగార్జునతో బ్లాక్ బస్టర్స్.. కానీ ఇప్పుడు
భార్య పెట్టిన ఒక్క మెసేజ్‌తో భర్త ఆత్మహత్య
భార్య పెట్టిన ఒక్క మెసేజ్‌తో భర్త ఆత్మహత్య
నిరుద్యోగులకు భలే న్యూస్.. త్వరలో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు భలే న్యూస్.. త్వరలో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఫిబ్రవరి 1 తర్వాత గోల్డ్‌ లోన్‌ తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా?
ఫిబ్రవరి 1 తర్వాత గోల్డ్‌ లోన్‌ తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా?
కేవలం రూ.65 వేలకే హోండా బైక్‌.. 65కి.మీపైగా మైలేజీ..!
కేవలం రూ.65 వేలకే హోండా బైక్‌.. 65కి.మీపైగా మైలేజీ..!
9 మ్యాచ్‌లు..5 సెంచరీలు..ఎవడు మమ్మీ వీడు..మనీషా లేక రన్ మెషినా ?
9 మ్యాచ్‌లు..5 సెంచరీలు..ఎవడు మమ్మీ వీడు..మనీషా లేక రన్ మెషినా ?
కేవలం రూ.2,500కే ప్రేమ బీమా..పెళ్లి తర్వాత రూ.1.2 లక్షలు క్లెయిమ్
కేవలం రూ.2,500కే ప్రేమ బీమా..పెళ్లి తర్వాత రూ.1.2 లక్షలు క్లెయిమ్
ఎట్టకేలకు గ్రూప్ 3 ఉద్యోగాలకు మోక్షం.. నేడే నియామక పత్రాలు అందజేత
ఎట్టకేలకు గ్రూప్ 3 ఉద్యోగాలకు మోక్షం.. నేడే నియామక పత్రాలు అందజేత
డోనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ బహుమతి ఇచ్చేసిన మచాడో..!
డోనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ బహుమతి ఇచ్చేసిన మచాడో..!