Telangana Elections: ప్రచారంలో ఉండగా మట్టిపెళ్లతో దాడి.. మూడు రోజుల వ్యవధిలో రెండోసారి

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో హైటెన్షన్ కొనసాగుతోంది. ఎన్నికల వేళ పార్టీల అభ్యర్థుల పై దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ నెల 11వ తేదీన అచ్చంపేటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణలో గువ్వల బాలరాజు పై రాయి దాడి సంచలనం రేపింది. అది జరిగి రెండు రోజులు కాకముందే మరోసారి మట్టిపెళ్లతో దాడి కలకలం సృష్టించింది.

Telangana Elections: ప్రచారంలో ఉండగా మట్టిపెళ్లతో దాడి.. మూడు రోజుల వ్యవధిలో రెండోసారి
Attack On Brs Mla Candidate Guvwala Balaraju In Acchampeta, Nagarkurnool District

Edited By:

Updated on: Nov 14, 2023 | 9:27 AM

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో హైటెన్షన్ కొనసాగుతోంది. ఎన్నికల వేళ పార్టీల అభ్యర్థుల పై దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ నెల 11వ తేదీన అచ్చంపేటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణలో గువ్వల బాలరాజు పై రాయి దాడి సంచలనం రేపింది. అది జరిగి రెండు రోజులు కాకముందే మరోసారి మట్టిపెళ్లతో దాడి కలకలం సృష్టించింది.

మరోమారు దాడి..

ఇటీవలే జరిగిన దాడి అనంతర బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది నియోజకవర్గానికి చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమ్రబాద్ మండలం కమ్మరోనిపల్లిలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా గువ్వల బాలరాజు వైపు ఓ మాట్టిపెళ్ళ దూసుకువచ్చింది. ఆయన మోచేతిని తాకుతూ కింద పడింది. ఈ ఘటనలో గువ్వల బాలరాజుకు స్వల్ప గాయం అయ్యింది. దాడి జరిగిన ఆనంతరం తన ప్రచారాన్ని గువ్వల కొనసాగించారు. ఆయనకు తాకిన మట్టిపెళ్లను అందరికీ చూపించారు.

దాడికి పాల్పడ్డ వ్యక్తి గుర్తింపు..

ఇక దాడి అనంతరం నిందితుడిని పట్టుకునేందుకు సమయం పట్టింది. చుట్టూ వందల మంది పార్టీ కార్యకర్తలు ఉండడం, చీకటి కావడంతో దాడికి పాల్పడ్డ వ్యక్తిని గుర్తించేందుకు సమయం పట్టింది. చివరకు ఓ వ్యక్తి పరుగున వెళ్లి ఇంట్లో గడియ పెట్టుకున్నాడు. ఆ వ్యక్తిని వెంబడించిన కార్యకర్తలు అదుపులోకి తీసుకోవాలని చూశారు. తీరా మట్టిపెళ్ళ విసిరిన వ్యక్తి మతి స్థిమితం లేని అదే గ్రామానికి చెందిన వ్యక్తి పర్వతాలు‌గా నిర్దారణ అయ్యింది.

ఇవి కూడా చదవండి

పోలీసుల హై అలెర్ట్..

వరుస ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే జిల్లా అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ అధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ సైతం నిర్వహించారు. అభ్యర్థుల ప్రచారం ఊపందుకోనున్న నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రత చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..