AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమను నిరాకరించినందుకు మరో యువతిపై దాడి

ప్రేమను నిరాకరించి మరొకరితో పెళ్లికి సిద్ధమైనదన్న కారణంతో యువతిపై కత్తెరతో దాడిచేశాడు ఓ ప్రేమోన్మాది. హైదరాబాద్ యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ దగ్గర్లోని జవహర్ నగర్లో ఓ యువతి ఉంటోంది. మొదటి అంతస్తులో ఉంటున్న యువతిపై అదే బిల్డింగ్లో కింది పోర్షన్లో ఉంటున్న యూసఫ్ ఆమెపై కత్తెరతో దాడికి పాల్పడ్డాడు. ఈ నెల 2న ఆమెకు మరొక యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న యూసఫ్.. బయటినుంచి ఇంట్లోకి వస్తున్న యువతిపై దాడి చేశాడు. దీంతో యువతి మెడ, […]

ప్రేమను నిరాకరించినందుకు మరో యువతిపై దాడి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 21, 2019 | 12:58 PM

Share

ప్రేమను నిరాకరించి మరొకరితో పెళ్లికి సిద్ధమైనదన్న కారణంతో యువతిపై కత్తెరతో దాడిచేశాడు ఓ ప్రేమోన్మాది. హైదరాబాద్ యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ దగ్గర్లోని జవహర్ నగర్లో ఓ యువతి ఉంటోంది. మొదటి అంతస్తులో ఉంటున్న యువతిపై అదే బిల్డింగ్లో కింది పోర్షన్లో ఉంటున్న యూసఫ్ ఆమెపై కత్తెరతో దాడికి పాల్పడ్డాడు. ఈ నెల 2న ఆమెకు మరొక యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న యూసఫ్.. బయటినుంచి ఇంట్లోకి వస్తున్న యువతిపై దాడి చేశాడు. దీంతో యువతి మెడ, చెవి భాగాల్లో గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.