Elections: లీడర్స్‌ను భయపెడుతోన్నటెక్నాలజీ.. ఎన్నికల వేల ఇదేం తలనొప్పి..
ప్రత్యర్థి పార్టీలను ఎదో రకంగా దెబ్బ తీసేందుకు వ్యూహాలు రచిస్తూ, అమలు చేసే పనిలో ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. అదే సమయంలో ఆయా పార్టీలలు.. తమ రాజకీయ ప్రత్యర్థులు వేస్తున్న ఎత్తుగడలను తిప్పికొట్టే పనిలో ఉన్నాయట. ఈ వ్యవహారంకు సోషల్ మీడియాను వేదికగా మార్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారిని టాక్. ఇక ప్రచారం చివరి దశలో ఉండడంతో ప్రత్యర్థి...
తెలంగాణలోని రాజకీయ పార్టీలకు డీప్ ఫేక్ వీడియోల టెన్షన్ పట్టుకుంది. ప్రత్యర్థి పార్టీలు డీప్ ఫేక్ వీడియోలతో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయంటా. డీప్ ఫేక్ వీడియోలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హల్ చల్ చేయబోతున్నయా. ? తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. రాజకీయ పార్టీలు హోరా హోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి.
ప్రత్యర్థి పార్టీలను ఎదో రకంగా దెబ్బ తీసేందుకు వ్యూహాలు రచిస్తూ, అమలు చేసే పనిలో ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. అదే సమయంలో ఆయా పార్టీలలు.. తమ రాజకీయ ప్రత్యర్థులు వేస్తున్న ఎత్తుగడలను తిప్పికొట్టే పనిలో ఉన్నాయట. ఈ వ్యవహారంకు సోషల్ మీడియాను వేదికగా మార్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారిని టాక్. ఇక ప్రచారం చివరి దశలో ఉండడంతో ప్రత్యర్థి పార్టీ లు ఏ విధంగా దాడి చేస్తాయి అని లెక్కలు వేసుకునే పనిలో ఉన్నాయన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది.
తాజాగా ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇబ్బందికరంగా మారిన డీప్ ఫేక్ వీడియోల అంశం ఇప్పుడు రాజకీయ పార్టీలకు టెన్షన్ పెట్టనుందన్న చర్చ ఇప్పుడు మొదలైంది. డీప్ ఫేక్ విడియోల వ్యవహారం ఇప్పటికే హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో ప్రత్యర్థి పార్టీలు డీప్ ఫేక్ వీడియోలు తో ఇబ్బంది పెడతారన్న అభిప్రాయం తో రాజకీయ పార్టీలు ఉన్నాయి. అందుకే డీప్ ఫేక్ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని శ్రేణులను ఆయా పార్టీలు కోరుతున్నాయి.
ఇటు సోషల్ మీడియా కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఓటర్లు డీప్ ఫేక్ వీడియోలతో ప్రభావితం కాకుండా కోరుతున్నారు. అయితే మొత్తంగా రాజకీయ పార్టీలకు డీప్ ఫేక్ వీడియోల టెన్షన్ పట్టుకున్నట్టు కనిపిస్తోంది. మరి నిజంగానే ఈ డీప్ ఫేక్ వీడియోలు ఈ ఎన్నికల్లో ఏమైనా ప్రభావం చూపుతుతాయా.? లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..