Bharat Jodo Yatra: రాహుల్‌గాంధీ జోడో యాత్రలో పరుగు పందెం.. చిన్నారులతో కలిసి రన్నింగ్..
తెలంగాణలో రాహుల్‌గాంధీ జోడో యాత్ర కొనసాగుతోంది. రాష్ట్రంలో ఐదో రోజుకు చేరుకున్న రాహుల్ పాదయాత్ర అక్టోబరు 30 న ఉదయం జడ్చర్లలోని శ్రీ సద్గురు మహర్షి మహాలయ స్వామి లలితాంబిక తపోవనం, గొల్లపల్లి..
తెలంగాణలో రాహుల్‌గాంధీ జోడో యాత్ర కొనసాగుతోంది. రాష్ట్రంలో ఐదో రోజుకు చేరుకున్న రాహుల్ పాదయాత్ర అక్టోబరు 30 న ఉదయం జడ్చర్లలోని శ్రీ సద్గురు మహర్షి మహాలయ స్వామి లలితాంబిక తపోవనం, గొల్లపల్లి నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో రాహుల్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. చిన్నారులతో కలిసి పరుగుపందెంలో పాల్గొన్నారు. రాహుల్ పాదయాత్రకు మేముసైతం అంటూ కొందరు చిన్నారులు వచ్చారు. వారిని చూసిన రాహుల్ రెట్టించిన ఉత్సాహంతో జోడో యాత్రను కొనసాగించారు. చిన్నారులతో కలిసి రన్నింగ్ చేసుకుంటూ ముందుకు సాగిపోయారు. ఆ వెనకే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ కూడా పరుగందుకున్నారు. దాంలో మిగతా కార్యకర్తలు కూడా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ పరగులు తీశారు. రాహుల్ గాంధీ జోడో యాత్రలో భాగంగా ఇవాళ 22 కిలోమీటర్లు సాగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సాయంత్రం రాహుల్ గాంధీ షాద్‌నగర్‌లోని సోలిపూర్ జంక్షన్ వద్ద సభలో పాల్గొంటారు. కాగా నవంబర్ ఏడో తేదీ వరకు రాష్ట్రంలో రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది. ఇందులో భాగంగా 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాలను రాహుల్ కవర్ చేయనున్నారు. నవంబర్ 4న యాత్రకు ఒక రోజు విరామం ఇస్తారు. ఈ పాద యాత్రలో రాహుల్ గాంధీ క్రీడా, వ్యాపార, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, వివిధ సంఘాల నాయకులతో సమావేశమవుతారు.
కాగా.. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఆదివారం రాత్రికి షాద్ నగర్ ఆర్టీవో కార్యాలయం సమీపంలోని ఫరూక్ నగర్ లో బస చేస్తారు. ఈరోజు భారత్ జోడో పాదయాత్ర 22 కిలోమీటర్ల మేర సాగనుంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో భారత్ జోడో యాత్ర పూర్తిచేసిన రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. పాదయాత్ర మార్గంతో పాటు పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక వాటిని తీరుస్తానని హామీ ఇస్తున్నారు.
जब रेस लगाई राहुल गांधी ने…#BharatJodoYatra pic.twitter.com/iJtd3fOcYW
— Congress (@INCIndia) October 30, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..