AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhu Yashki: పైసా లేని సుశీ ఇన్‌ఫ్రాకు వేల కోట్ల ప్రాజెక్ట్‌ ఎలా వచ్చింది.. రాజగోపాల్ రెడ్డిపై మధు యాష్కీ ఫైర్..

ఆపరేషన్‌ బొగ్గు.. కోమటిరెడ్డి కంపెనీపై కాంగ్రెస్‌ ఎక్కుపెట్టిన ఆరోపణాల అస్త్రం. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సుశీల్‌ ఇన్‌ ఫ్రా చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది. కాంగ్రెస్‌,టీఆర్‌ఎస్‌ రాజగోపాల్ రెడ్డి కంపెనీపై ఆరోపణలు దాడి ఎక్కుపెట్టాయి.

Madhu Yashki: పైసా లేని సుశీ ఇన్‌ఫ్రాకు వేల కోట్ల ప్రాజెక్ట్‌ ఎలా వచ్చింది.. రాజగోపాల్ రెడ్డిపై మధు యాష్కీ ఫైర్..
Madhu Yashki Raj Gopal Reddy
Shaik Madar Saheb
|

Updated on: Oct 30, 2022 | 12:36 PM

Share

ఆపరేషన్‌ బొగ్గు.. కోమటిరెడ్డి కంపెనీపై కాంగ్రెస్‌ ఎక్కుపెట్టిన ఆరోపణాల అస్త్రం. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సుశీల్‌ ఇన్‌ ఫ్రా చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది. కాంగ్రెస్‌,టీఆర్‌ఎస్‌ రాజగోపాల్ రెడ్డి కంపెనీపై ఆరోపణలు దాడి ఎక్కుపెట్టాయి. టీవీ9 బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌లో మొదలైన 18 వేల కాంట్రాక్ట్‌ ఆరోపణల నుంచి ఇప్పుడు సుశీ ఇన్‌ ప్రా కంపెనీ నుంచి ఐదు కోట్లకు పైగా నగదు బదిలీ జరిగిందనేది మరో ఆరోపణ. దీనిపై టీఆర్ఎస్ పలు ఆరోపణలు చేయగా.. ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా ఆరోపణలు ఎక్కుపెట్టింది. ఆపరేషన్‌ బొగ్గు పేరుతో బుక్‌లెట్‌ విడుదల చేసింది. పైసా లేని, నష్టాల్లో ఉన్న సుశీ ఇన్‌ ఫ్రాకు పెద్ద ప్రాజెక్ట్‌ ఎలా వచ్చిందనేది కాంగ్రెస్‌ నేతల ప్రశ్న. రాజగోపాల్‌, బీజేపీ క్విడ్‌ ప్రో కో వల్లే అదానీకి ఇవ్వాల్సిన ప్రాజెక్ట్‌ సుశీ ఇన్‌ ప్రాకు దక్కిందని కాంగ్రెస్‌ మధు యాష్కీ పేర్కొన్నారు.

మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిపై కాంగ్రెస్‌ నేత మధుయాష్కీ మండిపడ్డారు. వ్యాపార లబ్దికోసమే పార్టీ మారాడని మండిపడ్డారు. పైసా లేని సుశీ ఇన్‌ఫ్రా కంపెనీకి.. వేల కోట్ల ప్రాజెక్టు ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు యాష్కీ. నష్టాల్లో ఉన్న సుశీ ఇన్‌ఫ్రా కంపెనీని లాభాల్లోకి తెచ్చుకునేందుకే.. రాజగోపాల్‌రెడ్డి బీజేపీతో బేరసారాలు జరిపారని ఆరోపించారు. కాంట్రాక్టులతో సంపాదించిన డబ్బుతో.. మునుగోడు ప్రజలకు పేలాలు పంచి, తాను మాత్రం బిర్యానీ తింటున్నారని మండిపడ్డారు యాష్కీ.

ఇవి కూడా చదవండి

కేటీఆర్ ఫైర్..

ఇటు కంపెనీకి కాంట్రాక్ట్‌ అలా దక్కిందని కాంగ్రెస్‌ విమర్శలు చేస్తే.. సుశీ ఇన్‌ ఫ్రా నుంచి మునుగోడులో పంచేందుకు నగదు బదిలీ చేశారనేది కేటీఆర్‌ ఆరోపణ. మూడు రోజుల్లో ఐదు కోట్లకు పైగా డబ్బులు బదిలీ చేశారని మంత్రి కేటీఆర్‌ టీవీ9 బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌లో కూడా ఆరోపించారు. బ్యాంకు స్టేట్‌మెంట్‌ ఆధారాలను కూడా ఆయన చూపించారు. ఈ డబ్బును గ్రామాలు, వార్డుల వారీగా ఏజెంట్లు.. ఓటర్ల అకౌంట్లలోకి మళ్లించారని అన్నారు.

పదిలక్షల నుంచి దాదాపు 50 లక్షల వరకు నగదు వివిధ అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్‌ అయింది. మునుగోడు చెందిన తన అనుచరుల అకౌంట్లలోకి డబ్బు పంపించారని టీఆర్‌ఎస్‌ ఆధారాలను ఈసీకి అందజేసింది. ఈ నగదు బదిలీపై విచారణ జరిపించాలని ఈసీని కోరింది.

అయితే ఈ ఆరోపణలను సుశీ ఇన్‌ ఫ్రా ఖండించింది. కేటీఆర్‌ ఆరోపణలు అవాస్తమని కంపెనీ సీఈవో, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కొడుకు సంకీర్త్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. ఫేక్ న్యూస్ అంటూ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి