AP – Telangana: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సెలవు తేదీ మార్పు.. సర్క్యూలర్స్ జారీ

విద్యార్థులకు అలెర్ట్. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పండుగ సెలవు తేదీ మారింది. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి

AP - Telangana: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సెలవు తేదీ మార్పు.. సర్క్యూలర్స్ జారీ
Diwali 2022
Follow us

|

Updated on: Oct 20, 2022 | 4:05 PM

దీపావళి సెలవు విషయమై ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తొలుత అక్టోబర్ 25న దీపావళి సెలవును అనౌన్స్ చేశాయి ప్రభుత్వాలు. కానీ తాజాగా సెలవు తేదీని అక్టోబర్ 24గా మారుస్తూ సర్క్యూలర్స్ జారీ చేశాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ.. సోమవారం సెలవు ఉంటుంది. ఇక స్కూల్స్, కాలేజీలు కూడా మంగళవారానికి బదులు సోమవారం సెలవు అనౌన్స్ చేస్తున్నాయి. దీంతో స్టూడెంట్స్‌కు వరుసగా ఆదివారం, సోమవారం రెండు రోజులు సెలవులు కలిసి వస్తున్నాయి.

క్యాలెండర్ ప్రకారం అయితే దీపావళి పండుగ అక్టోబర్ 25న వస్తుంది. కానీ ఆ రోజు సాయంకాలం 5.11 గంటల నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంది. ఆ రోజు అమావాస్య ఘడియలు వెళ్లిపోతాయి కాబట్టి పండుగ జరుపుకోవడం కుదరదని ఆగమ పండితులు, పూజారులు చెబుతున్నారు  24వ తేదీన రాతంత్రా అమావాస్య ఘడియలు ఉంటాయి. కాబట్టి ఆ రోజు ఫెస్టివల్ జరుపుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వాలు తీసుకున్న తాజా నిర్ణయంతో.. సెలవు విషయంలో ఉన్న గందరగోళానికి ఎండ్ కార్డ్ పడింది.

ఈ ఏడాది పండుగల తేదీల విషయంలో మొదట్నుంచి కొంత కన్‌ఫ్యూజన్ ఉంది. దీపావళి విషయంలో అయితే..  ఈ కన్‌ఫ్యూజన్ ఇంకాస్త పీక్‌కి చేరింది.  కొన్ని ప్రాంతాల్లో దీపావళి అక్టోబర్ 24వ తేదీ అంటే, ఇంకొన్ని చోట్ల 25వ తేదీన అని చెబుతూ వచ్చారు. ప్రభుత్వాల నిర్ణయంతో మొత్తానికి ఓ క్లారిటీ వచ్చింది. సండే ఎలాగూ హాలి డే.. మండే ఫెస్టివల్ హాలిడే.. దీంతో బ్యాక్ టూ బ్యాక్ రెండు రోజుల సెలవలు కూడా వచ్చేశాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!