Vande Bharat: వందేభారత్ ఎక్స్‏ప్రెస్ పై మరోసారి రాళ్ల దాడి.. రాయి విసరడంతో పగిలిన కోచ్ అద్దం..

ప్రయాణికులకు అత్యంత మెరుగైన ప్రయాణ అనుభవం అందించేందుకు తీసుకువచ్చిన వందేభారత్ రైళ్లపై రాళ్లదాడి జరగడం నిత్యకృత్యంగా మారుతోంది. విశాఖ, ఖమ్మం ఘటనలను మరవకముందే.. తాజాగా...

Vande Bharat: వందేభారత్ ఎక్స్‏ప్రెస్ పై మరోసారి రాళ్ల దాడి.. రాయి విసరడంతో పగిలిన కోచ్ అద్దం..
Vande Bharat Express
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 10, 2023 | 8:11 PM

ప్రయాణికులకు అత్యంత మెరుగైన ప్రయాణ అనుభవం అందించేందుకు తీసుకువచ్చిన వందేభారత్ రైళ్లపై రాళ్లదాడి జరగడం నిత్యకృత్యంగా మారుతోంది. విశాఖ, ఖమ్మం ఘటనలను మరవకముందే.. తాజాగా మరో ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మహబూబాబాద్‌-గార్ల రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో ఒక బోగి అద్దాలు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే రక్షక దళం వెంటనే.. స్పాట్ కు చేరుకున్నారు. నిందితుడిని గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నారు. రైలు సికింద్రాబాద్‌ నుంచి విశాఖ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. రాళ్ల దాడిలో రైలు C-8 కోచ్‌లో అద్దం పగిలిందని, అయితే.. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడం కాస్త ఊరట కలిగించే విషయం.

కాగా.. గతంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్ రైలుపై ఖమ్మం రైల్వే స్టేషన్ దాటిన తర్వాత కొందరు రాళ్లు విసిరారు. ఈ దాడిలో రైలు కోచ్ అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు దుండగులను గుర్తించారు. వందే భారత్ రైలుపై ప్రారంభానికి ముందే విశాఖలోనూ రాళ్ల దాడి జరిగింది. ట్రయిల్ రన్ లో భాగంగా విశాఖకు వచ్చిన వందే భారత్ ట్రైన్ బోగీలపై కంచరపాలెంలో రాళ్లతో దాడి చేశారు. రామ్మూర్తి పంతులుపేట గేటు దగ్గర ఆకతాయిలు ట్రైన్ పై రాళ్లు విసిరారు. వారిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు.. ముంబయి-సోలాపూర్‌, ముంబయి-సాయినగర్ షిర్డీ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. రైల్వేలో వందేభారత్ రైళ్లు కొత్త శకానికి నాంది పలికాయని మోదీ కొనియాడారు. 17 రాష్ట్రాల్లోని 108 జిల్లాలు ఈ రైళ్ల ద్వారా అనుసంధానమవుతాయని చెప్పారు. ముంబయి, పుణె లాంటి ఆర్థిక కేంద్రాలను అనుసంధానించడం వందే భారత్‌ రైళ్లతో సాధ్యమైందని ఆనందం వ్యక్తం చేశారు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ నుంచి ఈ రైళ్లు సేవలు అందిస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..