మరో ఆర్టీసీ కార్మికుడి బలిదానం..

మరో ఆర్టీసీ కార్మికుడు బలిపీఠం ఎక్కాడు. వారి సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఉద్యోగాలు రావనే మనస్తాపంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహబూబాబాద్‌ డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా  విధులు నిర్వహిస్తున్న ఆవుల నరేష్‌ సమ్మెపై ప్రభుత్వ అనుసరిస్తునన తీరుతో మనస్థాపానికి గురయ్యాడు. బుధవారం ఉదయం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ డ్రైవర్ నరేష్ మృతి చెందాడు. దీంతో డ్రైవర్ కుటుంబంలో విషాద […]

  • Pardhasaradhi Peri
  • Publish Date - 3:26 pm, Wed, 13 November 19
మరో ఆర్టీసీ కార్మికుడి బలిదానం..
మరో ఆర్టీసీ కార్మికుడు బలిపీఠం ఎక్కాడు. వారి సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఉద్యోగాలు రావనే మనస్తాపంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహబూబాబాద్‌ డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా  విధులు నిర్వహిస్తున్న ఆవుల నరేష్‌ సమ్మెపై ప్రభుత్వ అనుసరిస్తునన తీరుతో మనస్థాపానికి గురయ్యాడు. బుధవారం ఉదయం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ డ్రైవర్ నరేష్ మృతి చెందాడు. దీంతో డ్రైవర్ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇప్పటికే సమయం మించిపోయిందని ఇంకెన్ని రోజులు సమ్మె చేయాలో తెలీక ఆర్టీసీ కార్మికులు కూడా నిర్వేదానికి గురవుతున్నారు.
నరేష్‌ స్వగ్రామం మరిపెడ మండలం ఎల్లంపేట. గత 15 ఏళ్లుగా ఆర్టీసీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆర్టీసీ సమస్య పరిష్కారం అవుతుందో కాదో అని తీవ్ర మనస్తాపం చెందిన నరేష్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తోటి కార్మికులు ప్రజా సంఘాలు, మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన చేపట్టారు.