దీనికి బాధ్యులెవరు..? లోతుగా విచారణ..!

కాచిగూడ రైలు ప్రమాదంపై హైలెవల్‌ కమిటీ రంగంలోకి దిగింది. యాక్సిడెంట్‌కు గల కారణాలను తెలుసుకునేందుకు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఈ కమిటీని నియమించింది. దీనికి బాధ్యులెవరనేది సభ్యులు తేల్చనున్నారు. ఇప్పటికే ఎంఎంటీఎస్‌ లోకో పైలట్‌ తప్పుందని ప్రాథమికంగా నిర్ధారణ అయినా.. సాంకేతిక అంశాలను కూడా కమిటీ తేల్చనుంది. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీకి రైల్వే సేఫ్టీ కమిషనర్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఇటు రైలు ప్రమాదంపై పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎంఎంటీఎస్‌ లోకో […]

దీనికి బాధ్యులెవరు..? లోతుగా విచారణ..!


కాచిగూడ రైలు ప్రమాదంపై హైలెవల్‌ కమిటీ రంగంలోకి దిగింది. యాక్సిడెంట్‌కు గల కారణాలను తెలుసుకునేందుకు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఈ కమిటీని నియమించింది. దీనికి బాధ్యులెవరనేది సభ్యులు తేల్చనున్నారు. ఇప్పటికే ఎంఎంటీఎస్‌ లోకో పైలట్‌ తప్పుందని ప్రాథమికంగా నిర్ధారణ అయినా.. సాంకేతిక అంశాలను కూడా కమిటీ తేల్చనుంది. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీకి రైల్వే సేఫ్టీ కమిషనర్‌ నేతృత్వం వహిస్తున్నారు.

ఇటు రైలు ప్రమాదంపై పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎంఎంటీఎస్‌ లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే పోలీసులు అంచనా వేస్తున్నారు. సిగ్నల్‌ క్లియరెన్స్‌ లేకుండానే రైలును మూవ్‌ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సిగ్నల్‌ను విస్మరించడమా? లేక మరేదైనా కారణం ఉందా అనేది పోలీసులు విచారిస్తున్నారు. ఘటనపై ఇప్పటికే కాచిగూడ స్టేషన్‌ మాస్టర్‌తో పాటు మరో ఆరుగురి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశారు.

రైలును నిర్లక్ష్యంగా నడిపినందుకు ఐపీసీ సెక్షన్‌ 337, ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసి ఇతరులకు హాని చేసినందుకు సెక్షన్‌ 338 కింద చంద్రశేఖర్‌పై కేసులు నమోదు చేశారు.