వందేళ్లుగా గబ్బిలాలతోనే సావాసం

గబ్బిలాలకు ఆ ఊరితో వందేండ్ల అనుబంధం ఉన్నది…అన్నిఊళ్లలో కోడికూతతో ప్రజలు మేల్కొంటే ఆ గ్రామస్తులు మాత్రం గబ్బిలాల కిచకిచలతో నిద్రలేస్తారు. పగటి పూట ఆహారం కోసం వెళ్లి రాత్రుల్లో వందల సంఖ్యలో గ్రామానికి చేరుకుంటాయి. పంచాయతీ పక్కనున్న చింత చెట్టుపై చేరుకొని వేలాడుతూ కనిపిస్తాయి. పరమశివుడి కటాక్షం వల్లే తమ గ్రామంలో గబ్బిలాలు ఉంటున్నాయన్నది ఆ ఊరి ప్రజల నమ్మకం. అలా గబ్బిలాల మోతకు కేరాఫ్ గా మారింది రుద్రారం గ్రామం. గబ్బిలాల వల్ల ఎబోల వంటి […]

వందేళ్లుగా గబ్బిలాలతోనే సావాసం
Pardhasaradhi Peri

|

Nov 13, 2019 | 4:46 PM

గబ్బిలాలకు ఆ ఊరితో వందేండ్ల అనుబంధం ఉన్నది…అన్నిఊళ్లలో కోడికూతతో ప్రజలు మేల్కొంటే ఆ గ్రామస్తులు మాత్రం గబ్బిలాల కిచకిచలతో నిద్రలేస్తారు. పగటి పూట ఆహారం కోసం వెళ్లి రాత్రుల్లో వందల సంఖ్యలో గ్రామానికి చేరుకుంటాయి. పంచాయతీ పక్కనున్న చింత చెట్టుపై చేరుకొని వేలాడుతూ కనిపిస్తాయి. పరమశివుడి కటాక్షం వల్లే తమ గ్రామంలో గబ్బిలాలు ఉంటున్నాయన్నది ఆ ఊరి ప్రజల నమ్మకం. అలా గబ్బిలాల మోతకు కేరాఫ్ గా మారింది రుద్రారం గ్రామం. గబ్బిలాల వల్ల ఎబోల వంటి భయంకరమైన రోగాలు వస్తున్నాయంటున్న ప్రస్తుత రోజుల్లో అవి తమకు అదృష్టమని చెబుతున్నారు గ్రామస్తులు. మహూబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం రుద్రారంలో గబ్బిలాలు శతాబ్ద కాలానికి పైగా నివాసముంటున్నాయి.. గ్రామ శివారులోని కూచూర్ రోడ్డు పక్కనే కొన్ని దశాబ్దాల క్రితం పాటిగుట్ట ఉండేదని.. ఆ గుట్టలో అప్పట్లో పరమశివుడితో పాటు వివిధ రకాల దేవుళ్లు ఉండేవారని చెబుతుంటారు. అప్పట్లో గ్రామస్తులు అక్కడ మొక్కులు తీర్చుకునేవారని అంటున్నారు. అప్పటి నుంచే గ్రామంలోని చెట్లపైనే దేవుడి కటాక్షంతో గబ్బిలాలు నివసిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో గబ్బిలాలు ఉండడం తమ గ్రామానికి శుభప్రదమంటున్నారు. గ్రామంలోని చింతచెట్లపై వేలాది గబ్బిలాలు నివసిస్తున్నాయి. గ్రామపంచాయతీ పక్కన ఉన్న చింతచెట్లపై తలకిందులుగా వేలాడుతూ జీవిస్తున్నాయి. గబ్బిలాలు నిశాచర జీవులు..కాబట్టి అవి రాత్రి వేళ చెట్ల పై నుంచి వివిధ ప్రాంతాకు వెళ్లి ఆహారం సేకరించుకొని తిరిగి తెల్లవారకముందే చింతచెట్లపైకి చేరుకుంటున్నాయి. పగటి పూట వాటికి కళ్లు కనిపించకపోవడంతో రాత్రి వేళల్లో మాత్రమే సంచరిస్తుంటాయి. గబ్బిలాలతో పాటు వాటి పిల్లలను కూడా ఆహారం కోసం తీసుకెళతాయి. కాశీలో ఆఘోరాలు ఎలా ఉంటారో…అలాగే రుద్రారంలోనూ శివుడి దయ వల్ల గబ్బిలాలు ఉంటున్నాయని గ్రామ పెద్దలు చెబుతున్నారు. రుద్రారం పక్కనే ఉన్న గ్రామాల్లో దట్టమై అడవులు, చెట్లు, దట్టమైన పొదలు ఉన్నప్పటికీ ఎక్కడికీ వెళ్లకుండా రుద్రారంలోనే జీవిస్తుండటంతో ఆ గ్రామానికి గబ్బిలాలకు విడదీయరాని బంధం ఉందని గ్రామస్తులు భావిస్తున్నారు. గబ్బిలాలను తీసుకెళ్లేందుకు కొంతమంది ప్రయత్నించినప్పిటికీ గ్రామస్తులు అడ్డుకున్నారు. అవి తమకు ఎలాంటి హాని కల్గించకపోగా తమ గ్రామానికి అదృష్టమని, వాటి వల్లనే తమ గ్రామంలో శివుని చల్లని చూపు ఉందని గ్రామస్తులు భావిస్తున్నారు. ఈ పక్షుల కిలకిలలే తమ గ్రామానికి అందమని..వాటితో సహవాసం తమకు అలవాటైపోయిందంటున్నారు రుద్రారం గ్రామస్తులు. ఎన్నో సంవత్సరాల నుంచి అవి గ్రామ శివారులో ఉన్నప్పటికీ వాటి వళ్ల గ్రామానికి..గ్రామస్తుల వల్ల గబ్బిలాలకు ఎలాంటి హాని కలగలేదు. అందుకే గబ్బిలాలకు రుద్రారం గ్రామానికి విడదీయరాని బంధం ఉందంటున్నారు స్థానికులు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu