Amit Shah: అధికారమే లక్ష్యంగా స్పీడు పెంచిన కాషాయ దళం.. తెలంగాణకు బీజేపీ అగ్రనేతల రాక..

Telangana Assembly elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో భారతీయ జనతా పార్టీ జోరు పెంచింది. ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు క్యూ కట్టనున్నారు. ఇవాళ్టి నుంచి అగ్రనేతల వరుస పర్యటనలు ఉండేలా బీజేపీ ప్రచార షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే ఇవాళ మరోసారి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణకు వస్తున్నారు.

Amit Shah: అధికారమే లక్ష్యంగా స్పీడు పెంచిన కాషాయ దళం.. తెలంగాణకు బీజేపీ అగ్రనేతల రాక..
Amit Shah
Follow us

|

Updated on: Nov 20, 2023 | 8:22 AM

Telangana Assembly elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో భారతీయ జనతా పార్టీ జోరు పెంచింది. ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు క్యూ కట్టనున్నారు. ఇవాళ్టి నుంచి అగ్రనేతల వరుస పర్యటనలు ఉండేలా బీజేపీ ప్రచార షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే ఇవాళ మరోసారి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణకు వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మ.12:35కు బేగంపేటకు చేరుకొని.. ఒంటిగంటకు జనగామ సభలో పాల్గొంటారు అమిత్‌ షా. మధ్యాహ్నం 3 గంటలకు కోరుట్ల బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం 5:30 గంటలకి ఉప్పల్‌లో అమిత్‌షా రోడ్‌ షో చేస్తారు. మళ్లీ రాత్రికి తిరిగి ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు. అయితే రెండు రోజుల క్రితమే తెలంగాణకు వచ్చిన అమిత్‌షా బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. సూర్యాపేట, వరంగల్‌ బహిరంగ సభల్లో పాల్గొన్న అమిత్‌ షా క్యాడర్‌లో జోష్ నింపారు.

మరో బీజేపీ అగ్రనేత నితిన్‌ గడ్కరీ ఇవాళ తెలంగాణకు వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఎల్లారెడ్డి, కొల్లాపూర్ సభల్లో గడ్కరీ ప్రసంగించనున్నారు. మరో బీజేపీ అగ్రనేత దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా ఇవాళ హైదరాబాద్‌కు వస్తున్నారు. ముషీరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి తరపున రోడ్‌షోలో పఢ్నవీస్ పాల్గొంటారు. అలాగే ఈనెల 21న తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు పీయూష్‌ గోయల్‌ తెలంగాణకు వస్తున్నారు. ఈయన కూడా రెండు సభల్లో పాల్గొంటారు.

మరోవైపు ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈనెల 24, 25, 26 తేదీల్లో యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే ఈనెల 25, 26న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలంగాణలో పర్యటిస్తారు. హుజూరాబాద్‌, మహేశ్వరం సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

వీరితో పాటు అసోం సీఎం, గోవా సీఎం కూడా వచ్చే వారం ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు రానున్నారు. అలాగే బీజేపీ ఎన్నికల ప్రచారం మోదీతో ఎండింగ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తుంది బీజేపీ. దీని కోసం వచ్చే వారం మోదీ మరోసారి తెలంగాణ వస్తారని చెప్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. ఇవాళ్టి నుంచి బీజేపీ అగ్రనేతల రాకతో తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మాంసం ప్రియులకు పండగే.. భారీగా తగ్గిన చికెన్ ధరలు..ఏకంగా రూ.100కే
మాంసం ప్రియులకు పండగే.. భారీగా తగ్గిన చికెన్ ధరలు..ఏకంగా రూ.100కే
పాపం.! గుండెపోటుతో కుప్పకూలిన యువ నటి లక్ష్మిక.
పాపం.! గుండెపోటుతో కుప్పకూలిన యువ నటి లక్ష్మిక.
ఎర్రని మందారంలాంటి సోయగం ఈ కుర్రదాని సొంతం.. మృణాళిని రవి ఫొటోస్
ఎర్రని మందారంలాంటి సోయగం ఈ కుర్రదాని సొంతం.. మృణాళిని రవి ఫొటోస్
సినిమాలు నిల్లు.. గ్లామర్ షో మాత్రం ఫుల్లు.. రకుల్ అందాలు అదుర్స్
సినిమాలు నిల్లు.. గ్లామర్ షో మాత్రం ఫుల్లు.. రకుల్ అందాలు అదుర్స్
మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన తాజా సీఎం రేవంత్
మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన తాజా సీఎం రేవంత్
చెన్నైకి వాతావరణశాఖ హెచ్చరిక.. మరో 5 రోజులు.!
చెన్నైకి వాతావరణశాఖ హెచ్చరిక.. మరో 5 రోజులు.!
పోలీసులకే సవాల్ విసిరిన దొంగలు.. దిశ ఎస్సై ఇంట్లో దొంగతనం
పోలీసులకే సవాల్ విసిరిన దొంగలు.. దిశ ఎస్సై ఇంట్లో దొంగతనం
మహిళల్లో ఐరన్ లెవెల్స్ పెంచడానికి తప్పక తినాల్సిన ఆహారాలు ఇవి..
మహిళల్లో ఐరన్ లెవెల్స్ పెంచడానికి తప్పక తినాల్సిన ఆహారాలు ఇవి..
ఆదిలాబాద్ ను కమ్మేసిన పొగ మంచు.. ఓవైపు పొగమంచు, మరోవైపు చిరుజల్లు
ఆదిలాబాద్ ను కమ్మేసిన పొగ మంచు.. ఓవైపు పొగమంచు, మరోవైపు చిరుజల్లు
ప్ర‌ధాని మోడీకి చంద్రబాబు లేఖ‌.. తుఫాన్ బాధిత రైతులను ఆదుకోండి
ప్ర‌ధాని మోడీకి చంద్రబాబు లేఖ‌.. తుఫాన్ బాధిత రైతులను ఆదుకోండి