Telangana: ఆ నియోజకవర్గంలో తొలిసారి బరిలో నిలిస్తే చాలు.. గెలుపు పక్కా..

ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి గెలవాలని అనుకుంటారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు గెలుపే లక్ష్యంగా పోటీ చేస్తారు. పోటీ చేసిన తొలిసారే విజయం సాధిస్తే ఆ కిక్కే వేరు. ఈ నియోజకవర్గంలో నుంచి తొలిసారిగా పోటీ చేసే అభ్యర్థుల గెలుపు పక్కా. ఇప్పటి వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో కూడా తొలిసారి ఎంపీగా ఎన్నికైనవారే. ఆ నియోజకవర్గమేదో.. అక్కడ గెలిచిన నేతలెవరో తెలుసుకుందాం. నియోజక వర్గాల పునర్విజనలో భువనగిరి లోక్ సభ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది.

Telangana: ఆ నియోజకవర్గంలో తొలిసారి బరిలో నిలిస్తే చాలు.. గెలుపు పక్కా..
Telangana Elections

Edited By: Srikar T

Updated on: Jun 06, 2024 | 10:53 AM

ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి గెలవాలని అనుకుంటారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు గెలుపే లక్ష్యంగా పోటీ చేస్తారు. పోటీ చేసిన తొలిసారే విజయం సాధిస్తే ఆ కిక్కే వేరు. ఈ నియోజకవర్గంలో నుంచి తొలిసారిగా పోటీ చేసే అభ్యర్థుల గెలుపు పక్కా. ఇప్పటి వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో కూడా తొలిసారి ఎంపీగా ఎన్నికైనవారే. ఆ నియోజకవర్గమేదో.. అక్కడ గెలిచిన నేతలెవరో తెలుసుకుందాం. నియోజక వర్గాల పునర్విజనలో భువనగిరి లోక్ సభ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి, ఆలేరు, సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, నల్గొండ జిల్లాలోని నకిరేకల్, మునుగోడు, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, జనగాం జిల్లాలోని జనగాం శాసనసభ నియోజకవర్గాలు ఈ ఎంపీ పరిధిలో ఉన్నాయి. ఈ నియోజక వర్గం నుండి తొలిసారిగా పోటీ చేసినవారు ఎంపీగా పక్కాగా విజయం సాధిస్తుండడం విశేషం. ఇప్పటికి నాలుగు పర్యాయాలు ఎన్నికలు జరిగితే.. నలుగురు ఎంపీ పదవికి కొత్తగా ఎన్నికైన వారే.

2009లో జరిగిన తొలి ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడిగా వ్యాపార రంగం నుంచి నేరుగా వచ్చి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థిగా డా. బూర నర్సయ్యగౌడ్ ఎంపీగా ఎన్నికయ్యారు. వైద్యుడిగా బూర నర్సయ్య గౌడ్ గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమంలో డాక్టర్స్ ఐకాసలో చురుకుగా పని చేసి తొలిసారి ఎంపీగా విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంతకు ముందు ఎమ్మెల్యేగా, మంత్రిగా రాజకీయ అనుభవం ఉంది. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓటమిపాలైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. 2019లో తొలిసారిగా ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పని చేసినా.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించడంతో.. ఎంపీగా గెలిచారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..