AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Politics: పొంగులేటి పొలిటికల్ జర్నీపై వీడని సస్పెన్స్..! మాజీ ఎంపీ నిర్ణయం మే 13 తర్వాతేనా?

ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరనున్నారన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీఆర్ఎస్‌తో తెగతెంపులు చేసుకున్న పొంగులేటిని తమ పార్టీలో చేర్చుకునేందుకు గత కొన్ని మాసాలుగా అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి.

Telangana Politics: పొంగులేటి పొలిటికల్ జర్నీపై వీడని సస్పెన్స్..! మాజీ ఎంపీ నిర్ణయం మే 13 తర్వాతేనా?
Ponguleti Srinivas Reddy (File Photo)
Janardhan Veluru
|

Updated on: May 04, 2023 | 11:41 AM

Share

Khammam Politics: ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరనున్నారన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీఆర్ఎస్‌తో తెగతెంపులు చేసుకున్న పొంగులేటిని తమ పార్టీలో చేర్చుకునేందుకు గత కొన్ని మాసాలుగా అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి.  ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు పొంగులేటిని తమ పార్టీలో చేరాలని ఇప్పటికే బహిరంగ ఆహ్వానం పలికారు. ఆ పార్టీలకు చెందిన కొందరు వ్యూహకర్తలు కూడా ఆయనతో తెరవెనుక సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అటు షర్మిల పార్టీలో పొంగులేటి చేరుతారని కూడా ఓ సందర్భంలో ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలో ఆయన ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆయన రాజకీయ భవితవ్యంపై ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తినెలకొంటోంది.

ఈ నేపథ్యంలో ఇవాళ(గురువారం) మధ్యాహ్నం బీజేపీ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఆయనతో భేటీకానున్నారు. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ నేతృత్వంలోని బీజేపీ నేతల బృందం పొంగులేటిని కలవనున్నారు. పొంగులేటి నివాసంలోనే ఈ లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీలోకి రావాలని పొంగులేటిని బీజేపీ నేతలు ఆహ్వానించనున్నారు. గత కొద్ది రోజులుగానే పొంగులేటితో ఈటల రాజేందర్ సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ఈ విషయంలో పొంగులేటి ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది.

పొంగులేటి నిర్ణయం ఎప్పుడు?

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరాలని పొంగులేటి సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఏ పార్టీలో చేరాలన్న విషయంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాతే పొంగులేటి ఏ పార్టీతో కొత్త రాజకీయ జర్నీని మొదలుపెట్టాలనే విషయంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ గెలిస్తే ఆ పార్టీలో చేరుతారని ఖమ్మం రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారాన్ని సొంతం చేసుకుంటే.. ఆ పార్టీ వైపు పొంగులేటి మొగ్గుచూపే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. అంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 13న వెలువడనుండగా.. పొంగులేటి ఏ పార్టీలో చేరబోతున్నారన్న విషయంలో ఆ తర్వాతే క్లారిటీ రావొచ్చని తెలస్తోంది.

పొంగులేటి వస్తే ఆహ్వానిస్తాం: బండి సంజయ్

పొంగులేటి బీజేపీలో చేరికపై ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి దగ్గరికి ఈటెల వెళ్లారన్న సమాచారం తనకు లేదన్నారు. తన దగ్గర ఫోన్ లేదని, అందుకే ఇప్పటిదాకా సమాచారం రాలేదని చెప్పారు. అయితే ఈ విషయంలో తనకు చెప్పకపోవడం తప్పేం కాదన్నారు. పొంగులేటి పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు. తెలంగాణలో రాక్షస రాజ్యంపై పోరాడేందుకు ఎవరినైనా కలుపుకుపోతామన్నారు. పార్టీలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారని చెప్పారు. తనకు తెలిసినవారితో తాను మాట్లాడుతానని.. ఈటెలకు తెలిసినవారితో ఆయన మాట్లాడతారని.. ఇందులో తప్పేంలేదని బండి సంజయ్ అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి