Hyderabad: హెర్బల్ లైఫ్ పేరుతో మహిళల జీవితాలతో చెలగాటం.. అర్థరాత్రి న్యూడ్ కాల్స్ చేస్తూ..
ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఏకంగా ఇరవై మంది మహిళలను లోబర్చుకునే యత్నం. అర్ధరాత్రి న్యూడ్ కాల్స్ చేస్తూ వేధింపులు. మహిళల బాడీ పార్ట్స్ గురించి చెబుతూ వీడియో కాల్స్‌లో పోకిరీ చేష్టలు. హైదరాబాద్ కేపీహెచ్‌బిలో అరెస్టైన చంద్రశేఖర్ ఆగడాల్లో బయటపడిన కొన్ని దారుణాలు ఇవి.

అవును, హెర్బల్ లైఫ్ మేనేజర్ చంద్రశేఖర్ న్యూడ్ కాల్స్ వ్యవహారంలో కొత్త కోణాలు బయటికొచ్చాయ్. చంద్రశేఖర్ వేధించింది ఒకర్ని కాదు.. 20మందిని అని తేలింది. ఇది కూడా ఇప్పటివరకు దొరికిన లెక్క మాత్రమే. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చు అంటున్నారు కేపీహెచ్‌బీ పోలీసులు.
ఏడాది క్రితం హెర్బల్ లైఫ్‌లో మేనేజర్‌గా చేరిన చంద్రశేఖర్.. వెయిట్‌లాస్ కోసం వచ్చే మహిళలను లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. ముందు మంచివాడిలా మాట్లాడుతూ ఆ తర్వాత చనువు పెంచుకోవడం, చివరికిగా న్యూడ్ కాల్స్ పేరుతో వేధింపులకు దిగడం.. ఇదీ చంద్రశేఖర్ చేస్తోన్న ఆగడాలు.
ఫిట్‌నెస్ క్లాసుల పేరుతో ఫోన్ నెంబర్లు తీసుకుని మహిళలను లొంగదీసుకునే ప్రయత్నం చేశాడంటున్నారు కేపీహెచ్‌బీ పోలీసులు. చంద్రశేఖర్ ఫోన్ నుంచి కుప్పలకొద్దీ న్యూడ్ కాల్స్ వీడియోలు, అశ్లీల చాట్స్, పెద్దఎత్తున మహిళల ఫోన్ నెంబర్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇలాంటి వాళ్ల విషయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..